రౌడీ స్టార్‌ ఒకే సారి రెండు సినిమాలు.. మార్పు మంచిదే

Update: 2022-06-01 00:30 GMT
విజయ్ దేవరకొండ చివరగా వరల్డ్‌ ఫేమస్ లవర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2020 ఆరంభంలో కరోనాకు ముందు విడుదల అయిన ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాను విడుదల చేయలేక పోయాడు. వరల్డ్‌ ఫేమస్ లవర్ విడుదల అయిన వెంటనే విజయ్‌ తన తదుపరి సినిమా ను పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

కరోనా వల్ల ఆ సినిమా దాదాపుగా రెండేళ్లకు పైగానే సాగింది. ఇటీవల షూటింగ్‌ పూర్తి అయిన లైగర్ ను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. లైగర్ సినిమా విడుదల కాకుండానే శివ నిర్వాన దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు. అంతే కాకుండా పూరి జగన్నాద్‌ తో ఇటీవలే జనగనమణ సినిమాను మొదలు పెట్టాడు. ఇటీవలే సినిమా షూటింగ్‌ ను ప్రారంభించారు.

జనగనమణ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాకముందే శివ నిర్వాన దర్శకత్వంలో సినిమాను విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడు. ఇటీవలే కశ్మీర్‌ లో ఒక భారీ షెడ్యూల్‌ ను నిర్వహించారు. కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి అవ్వడంతో తదుపరి షెడ్యూల్‌ కోసం శివ నిర్వాత ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ రెండవ షెడ్యూల్‌ కు కూడా డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది.

మరో వైపు శివ నిర్వాన రెండవ షెడ్యూల్‌ ప్రారంభంకు ముందే రెండు లేద మూడు వారాల పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగనమణ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. జూన్‌ మొదటి వారంలో జనగనమణ సినిమా మొదటి షెడ్యూల్‌ ను ప్రారంభించబోతున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముంబయిలో జరుగుతున్నాయని కూడా సమాచారం అందుతోంది.

ఒక వైపు శివ నిర్వాన సినిమా మరో వైపు పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. లైగర్ సినిమా కోసం దాదాపుగా రెండు సంవత్సరాల పాటు సమయం కేటాయించిన విజయ్ దేవరకొండ తదుపరి సినిమా విషయంలో మరీ ఆలస్యం కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో పాటు శివ నిర్వాన సినిమా మరియు జనగనమణ సినిమాను కొద్ది తేడా లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒకే సారి రెండు సినిమాలు చేసేలా నిర్ణయాన్ని మార్చుకున్న విజయ్‌ దేవరకొండ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఇవ్వబోతున్నాడు. రౌడీ స్టార్‌ లో వచ్చిన మార్పు మంచిదే అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News