టాక్సీవాలా ఫుల్ రన్ కలెక్షన్స్

Update: 2018-12-18 09:47 GMT
విజయ్ దేవరకొండ - ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లు గా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సీవాలా' రిలీజ్ కు ముందు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. షూటింగ్ డిలే కావడం దగ్గరనుండి.. రా ఫుటేజ్ లీక్ కావడం లాంటి ఇబ్బందులను దాటి విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. కంటెంట్ ఉన్న సినిమాకు ప్రేక్షకులు పట్టం కడతారని 'టాక్సీవాలా' విజయం మరోసారి నిరూపించింది.

నవంబర్ 17 వ తేదీన రిలీజ్ అయిన 'టాక్సీవాలా' థియేట్రికల్ రన్ ఇప్పుడు పూర్తయింది.  రూ. 21 కోట్ల షేర్ కలెక్షన్స్ తో ఈ సినిమా విజయ్ దేవరకొండ కేరీర్ లో మూడో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో 'గీత గోవిందం'.. 'అర్జున్ రెడ్డి' సినిమాలు ఉన్నాయి.  తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడం.. మెజారిటీ ఏరియాల్లో నిర్మాతలే ఓన్ రిలీజ్ కు వెళ్ళడంతో 'టాక్సీవాలా' అందరికీ లాభాలు తీసుకొచ్చి హిట్ గా నిలిచింది.

ఫుల్ రన్ లో 'టాక్సీవాలా' ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం - 7.71  cr

సీడెడ్ - 1.64 cr

ఉత్తరాంధ్ర - 1.84  cr

ఈస్ట్  - 0.96 cr

వెస్ట్ - 0.79 cr

కృష్ణ - 1.14   cr

గుంటూరు - 1.15  cr

నెల్లూరు - 0.46 cr

ఏపీ+తెలంగాణా టోటల్ : రూ. 15.69 cr


రెస్ట్ ఆఫ్ ఇండియా :  2.59 cr

ఓవర్సీస్:  3.02 cr

వరల్డ్ వైడ్ టోటల్ : రూ.21.30 కోట్లు
Tags:    

Similar News