వెంకీ ఆదర్శ కుటుంబం.. అసలైన టైమొచ్చింది

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో వస్తున్న ఆదర్శ కుటుంబంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2026-09-21 07:28 GMT

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో వస్తున్న ఆదర్శ కుటుంబంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. టీజర్‌ తో సినిమాపై ఒక క్లారిటీ రావడంతో.. ఇప్పుడు అందరి చూపు మ్యూజిక్ ప్రమోషన్స్‌ పై పడింది. ముఖ్యంగా ఆ సినిమా నుంచి రాబోతున్న తొలి పాట 'నారాయణమ్మ'పై ఇంట్రెస్ట్ మొదలైంది. సెప్టెంబర్ 22న సాంగ్‌ ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.




 


అయితే టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఆదర్శ కుటుంబం మూవీకి కావాల్సిన స్టార్టింగ్ బజ్ వచ్చేసింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌ తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ లా కనిపిస్తూనే యాక్షన్ టచ్ కూడా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు అదే ఊపును మ్యూజిక్ ప్రమోషన్స్ కంటిన్యూ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తొలి సింగిల్‌ ను తీసుకురాబోతున్నారు.

ఒక సినిమా పాట అంటే కేవలం మ్యూజిక్ ప్రమోషన్ మాత్రమే కాదు. ఆ సాంగ్ ద్వారా సినిమాలో ఎలాంటి ఇన్విరాన్మెంట్ ఉండబోతోంది, ఎలాంటి ఫన్ ఉండబోతోంది, హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయంలో కూడా ప్రేక్షకులకు ఒక ఐడియా వస్తుంది. అందుకే మొదటి పాటకు ఎప్పుడూ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడే ఆదర్శ కుటుంబం మ్యూజిక్ టీమ్‌ పై బాధ్యత పెరిగింది.

తమన్ అందిస్తున్న మ్యూజిక్ పై ఇప్పటికే టీజర్ ద్వారా కొంత హైప్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కూడా క్లిక్ అయితే.. తర్వాత రాబోయే సాంగ్స్ పై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాటకు వచ్చే రెస్పాన్స్ సినిమాకు ఉన్న బజ్‌ ను మరింత పెంచే అవకాశం ఉంటుంది. వెంకటేష్‌ కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఆ విషయంలో మరో ప్లస్ పాయింట్.

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే పాటలు, వెంకీ అభిమానులకు కనెక్ట్ అయ్యే మాస్ టచ్.. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ కుదిరితే మ్యూజిక్ ప్రమోషన్స్ సినిమాకు మంచి ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇక చాలా కాలం తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడం, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించడం, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనుండటం మూవీకి ఎక్స్ ట్రా అట్రాక్షన్స్ గా మారాయి. దీనికితోడు అక్టోబర్ 2న టార్గెట్ గా ప్రమోషన్స్ సాగుతున్నాయి.

అయితే సినిమా విడుదలకు ముందు వచ్చే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మెయినే. టీజర్ ఒక స్టెప్ ముందుకు వేయిస్తే.. తొలి పాట మరో స్టెప్ వేయించాలి. నారాయణమ్మ ప్రేక్షకులకు నచ్చితే ఆ తర్వాత వచ్చే సాంగ్స్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అక్కడి నుంచి ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆదర్శ కుటుంబం మ్యూజిక్ ప్రమోషన్స్‌ లో ఫస్ట్ స్టెప్ స్ట్రాంగ్‌ గా పడటం చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News