విజయ్ సినిమా మళ్ళీ వాయిదా?

Update: 2018-06-04 06:01 GMT
అర్జున్ రెడ్డి కథానాయకుడు విజయ్ దేవరకొండ మళ్లీ సోలో బాక్స్ ఆఫీస్ హిట్ ఎప్పుడు కొడతాడా అని అతని ఫాలోవర్స్ చాలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మహానటి సినిమాలో కనిపించినప్పటికి అది తన విజయం కాదని ఒప్పుకున్నాడు. గత కొంత కాలంగా రూపుదిద్దుకుంటున్న టాక్సీవాలా సినిమాపైనే విజయ్ ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ సారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకున్నాడు.

హారర్ మరియు మంచి కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఆ సినిమాలో విజయ్ ఒక టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇకపోతే సినిమా విడుదల విషయంలో చాలా రోజులుగా చిత్ర యూనిట్ ఆలస్యం చేస్తోంది. ఆసలైతే మే 14న రిలీజ్ అవ్వాలి. సినిమా మొదలయినప్పటి నుంచి అదే డేట్ కి సినిమా రానుందని చెప్పారు. ఇక తీరా ఆ సమయం వచ్చే సరికి జూన్ 14న వస్తున్నట్లు విజయ్ చెప్పాడు. ఇక ఇదే ఫైనల్ అనుకున్నప్పటికి ఇప్పుడు ఆ డేట్ కి కూడా టాక్సీ వాలా రావడం లేదనే టాక్ వస్తోంది.

కొన్ని సీన్స్ విజయ్ దేవరకొండ రేంజ్ కి తగ్గట్టుగా లేవని మళ్లీ రీ షూట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలకు విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా వాడారు. ఆ పనులు ఆలస్యం అయినందువల్ల సినిమాను జులై కి పోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వనుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ అండ్ గ్యాంగ్ నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News