అప్పట్లో మహేశ్ సినిమా టికెట్ల కోసం ఫైట్ చేసేవాడట!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడేమైనా జరగొచ్చు. కాకుంటే కోరుకున్న దానిని.. మనసు పడిన దానిపైనే అదే పనిగా పని చేయటమే ముఖ్యం. సినిమాల్లో చెలరేగిపోవాలన్న విజయ్ దేవరకొండ ప్రయత్నాలు ఫలించటమే కాదు.. ఇటీవల కాలంలో మరే యువనటుడికి రానంత క్రేజ్ వచ్చేసింది.
చివరకు మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం.. విజయ్ తాజా గీతాగోవిందాన్నితన ఖైదీ మూవీతో పోల్చారు. అంతేనా.. మరొకరు.. అప్పట్లో పవన్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటూ పోల్చేయటం ద్వారా అతని లేటెస్ట్ స్టేటస్ ఏమిటన్న విషయాన్ని చెప్పేశారు.
ఇదిలాఉంటే.. తాజాగా మహేశ్ బాబుతో తాను దిగిన ఫోటోను ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు తాను మహేశ్ బాబు సినిమా టికెట్ల కోసం ఫైటింగ్ చేసేవాడినని.. ఇప్పుడు అదే మహేశ్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ కి వెళ్లి.. ఆయన చేస్తున్న సినిమా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నాడు.
మహేశ్ నటిస్తున్న మహర్షి షూటింగ్ సెట్ లో కలిసినప్పుడు దిగిన ఫోటోను ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అంతే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో?