• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర్జున్ రెడ్డీ.....

అర్జున్ రెడ్డీ.. ఏమైపోయావయ్యా

By - Tupaki Desk
Update: 2017-04-03 05:05 GMT
‘పెళ్లిచూపులు’ సినిమాతో రాత్రికి రాత్రే మాంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అంతకుముందే ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఆకట్టుకున్నప్పటికీ.. అతడి పేరు జనాల్లో రిజిస్టరవ్వలేదు. కానీ ‘పెళ్లిచూపులు’ సినిమా అతడికి తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ దెబ్బతో అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు అరడజను సినిమాలు అతడి ఖాతాలో చేరాయి. ‘పెళ్లిచూపులు’ విడుదలకు ముందే విజయ్ ఓకే చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’.  ఈ చిత్ర టీజర్ కొన్ని నెలల కిందట రిలీజై సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ గా అనిపించిన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

ఈ తరం యూత్ ఆడియన్స్ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ తో భలే కనెక్టయ్యారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ గురించి పెద్ద చర్చే జరిగింది. టాలీవుడ్లో ఇలా ఓ అప్ కమింగ్ హీరో సినిమా టీజర్ ఈ స్థాయిలో చర్చనీయాంశం కావడం అరుదు. ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా అనౌన్స్ చేసినపుడు దానిపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ.. ‘పెళ్లిచూపులు’తో విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రిలీజైన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచింది. అప్పట్నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ వచ్చాక ఈ సినిమా గురించి అప్ డేట్ లేదు. సినిమా పూర్తయిందా.. ఇంకా షూటింగ్ జరుపుకుంటోందా.. ఏం తెలియదు. మళ్లీ ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషం బయటికి రాలేదు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ అడ్వాంటేజీని వాడుకుంటూ సాధ్యమైనంత త్వరగా సినిమాను రెడీ చేస్తే మంచిది. కనీసం సినిమా ప్రోగ్రెస్ గురించి అప్ డేట్ కూడా ఇవ్వకుండా ఇలా సైలెంటైపోతే.. నెమ్మదిగా ఈ సినిమాకున్న క్రేజ్ అంతా పోతుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Vijay Devarakonda 
  • Arjun Reddy Movie 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS