తిరుక్కురళ్ 485 ను కోట్ చేసిన దేవరకొండ!
ఎందుకు విజయ్ దేవరకొండ మాత్రం అతి తక్కువసమయం లో స్టార్ అయ్యాడు? ఎంతోమంది స్టార్ కావాలని ఏళ్ళ తరబడి కుప్పిగంతులు.. పిట్టల దొర వేషాలు వేస్తున్నా పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు విజయ్ దేవరకొండకు మాత్రం అలా స్టార్ కిరీటం ఇచ్చారు? చాలా సింపుల్ గా.. అదే సమయంలో చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న ప్రశ్నలివి.
'అర్జున్ రెడ్డి' అని ఒకరు చెప్పొచ్చు. 'గీత గోవిందం' అని మరొకరు తేల్చి పారేయొచ్చు. కానీ ఇప్పుడున్న తెలుగు హీరోలలో ఎంతమంది అర్జున్ రెడ్డి పాత్ర పోషించగలరు అని ప్రశ్న వేసుకుంటే దానికి మనకు సమాధానం వస్తుంది. ఇక అలాంటి కాంప్లికేటెడ్ పాత్రలో జీవించాడు. ఇది ఒక మేజర్ పాయింట్.
ఇక నటన.. అందం మాత్రమే అంటే ప్రతి శుక్రవారం చాలామంది హీరోలు తెరకు పరిచయం అవుతారు.. సో అవి మాత్రం పనికి రావు. వారందరినీ విజయ్ ని వేరు చేసేది విజయ్ యాటిట్యూడ్. పైకి రఫ్ గా రౌడీగా డోంట్ కేర్ అన్నట్టుగా కనిపించే విజయ్ దేవరకొండ ట్విట్టర్ హ్యాండిల్ క్యాప్షన్ "మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్యేకం మహాత్మనం"(మనసులోని ఆలోచన.. నోటినుండి వచ్చే మాట.. చేసే పని ఒకటే అయితే వారే మహాత్ములు). ఈజీనా..?మనం మనసులో ఒకటి ఆలోచిస్తాం.. నోటితో ఒకటి చెప్తాం.. చేసేది వాటి రెంటికీ సంబంధం లేని మూడోది.
ఇక ఇంతటితో ఆగలేదు. 'నోటా' తమిళంలో కూడా రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఆర్నెల్ల క్రితం తనకు తమిళం రాదనీ ఈమధ్యే నేర్చుకున్నానని విజయ్ చెప్పాడు. కానీ రీసెంట్ గా చెన్నై లో నోటా ప్రమోషనల్ ఈవెంట్ లో తమిళం అలవోకగా మాట్లాడాడు. ఎండ్ లో తమిళుల సంస్కృతి కి ప్రతీక అయిన.. ఎంతో పవిత్రంగా భావించే 'తిరుక్కురళ్' నుండి ఒక కురళ్(తెలుగులో రఫ్ గా ఒక శ్లోకం అనుకోవచ్చు) ను కోట్ చేశాడు. దానికిముందు తన స్పీచ్ ని తిరుక్కురళ్ తో మొదలు పెట్టాను కాబట్టి దాంతోనే ఎండ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని "కాలం కరది ఇరుప్పది కలంగాది ఇరుప్ప ర్ కలంగాదు న్యాలం కరదు పవర్"('ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారు ఏమాత్రం చలించకుండా సరైన సమయం కోసం వేచి ఉంటారు' అని అర్థం) అంటూ తిరుక్కురళ్ లోని 485 స్టాంజా ను కోట్ చేశాడు. చాలామంది తమిళులు డెబ్బకి ఫ్లాట్ అయ్యారు. సోషల్ మీడియా లో రెస్పాన్స్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది.
దాంతో పాటు 'ది టైం ఈజ్ నౌ అండ్ ఐ మేడ్ మై స్ట్రైక్' అన్నాడు. ఇంత తక్కువ సమయంలోనే తమిళం నేర్చుకోవడం కాకుండా వాళ్ళను మెప్పించేవిధంగా స్పీచ్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇక సినిమా విషయం మాట్లాడుతూ "నోటా మీరు ఎంజాయ్ చేస్తారో లేదో నాకు తెలీదు. కానీ మీరు మాత్రం ఒక సూపర్బ్ పొలిటికల్ థ్రిల్లర్ మాత్రం చూడబోతున్నారు" అన్నాడు. అంతే కాదు 'మరన వెయిటింగ్' అంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఎప్పుడు 'నోటా' గురించి ఇన్ఫర్మేషన్ ట్విట్టర్ ఇచ్చినా.. తమిళ ప్రేక్షకులు 'మరన వెయిటింగ్' అంటున్నారని అందుకే మిమ్మల్ని అక్టోబర్ 5 న థియేటర్స్ లో కలిసేందుకు 'మరన వెయిటింగ్' అన్నాడు.
విజయ్ ను ఓవర్ నైట్ స్టార్ అని అందరూ అంటారు గానీ స్టార్ అయిన ఆ నైట్ కు ముందున్న ఐదారేళ్ళ కఠోర శ్రమను.. తపనను మాత్రం గుర్తించరు. అందుకేనేమో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 100 సినిమాలు కంప్లీట్ చేస్తాడని ధీమాగా చెప్పాడు.