• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కూ కోసం వేచి...

సుక్కూ కోసం వేచి చూస్తాడా? లేదా మరో దర్శకుడిని చూసుకుంటాడా?

By - Tupaki Desk
Update: 2021-12-24 00:30 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌ పై కేదార్‌ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి గతేడాదే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న 'లైగర్'.. సుకుమార్ తెరకెక్కించే 'పుష్ప' సినిమా పూర్తైన వెంటనే వీరి కలయికలో మూవీ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే కరోనా పాండమిక్ వల్ల 'పుష్ప' రెండు భాగాలుగా మారడం.. 'లైగర్' షూటింగ్ డిలే అవడం జరిగింది. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు సుక్కూ 'పుష్ప' పార్ట్-1 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రారంభంలో సుకుమార్ - విజయ్ ల కాంబో సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు 'పుష్ప 2' చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాలని సుకుమార్ అండ్ బన్నీ టీమ్ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో చిత్రీకరణ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఎంత శరవేగంగా షూటింగ్ జరిపినా ఇది వచ్చే ఏడాది చివరకు గానీ కంప్లీట్ అవదు.

ఇటు చూస్తే ఒక చిన్న షెడ్యూల్ మినహా 'లైగర్' షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు సుక్కూ ప్రాజెక్ట్ తప్ప మరో కొత్త చిత్రాన్ని వీడీ ప్రకటించలేదు. నెక్స్ట్ సుకుమార్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయితే మాత్రం.. ఇంకో ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ గ్యాప్ లో యువ హీరో మరో మూవీ చేయడానికి టైం దొరుకుతుంది.

పాన్ ఇండియా 'లైగర్' వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండకు నేషనల్ వైడ్ క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి దీనికి తగినట్లుగా తదితరులు సినిమా ప్లాన్ చేసుకోడానికి 'లైగర్' రిలీజ్ వరకు వేచి చూస్తాడా? లేదా సుకుమార్ కంటే ముందే మరో డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి సుకుమార్‌ - విజయ్‌ దేవరకొండ కాంబో లేట్ అవుతూ ఉండటంతో.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. అయితే వీటిని ఖండిస్తూ ఫాల్కన్‌ క్రియేషన్స్ టీమ్ ఓ నోట్ రిలీజ్ చేసింది. దర్శక హీరోల కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని.. సుకుమార్-VD-ఫాల్కన్ కలయిక బిగ్గర్ గా ఉండబోతోందని.. 2022 లోనే సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.


Tags:    
  • Vijay Devarakonda 
  • sukumar 
  • Liger 
  • Puri Jagannadh 
  • News Today 
  • Trend News 
  • movie update 
  • upcomeing movie 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS