గోవిందుడు పెట్టుబడి - రాబడి ఎంతో తెలుసా?
ఈమద్య కాలంలో పెద్ద నిర్మాతలు చిన్న చిత్రాల వెనుక ఎందుకు పడుతున్నారో ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత అర్థం అయ్యింది. ఆమద్య ‘పెళ్లి చూపులు’ చిత్రంతో సురేష్ బాబు ఏకంగా 10 కోట్ల లాభంను దక్కించుకున్నాడు. ఆయన పెట్టింది కోటి రూపాయలు మాత్రమే. ఇప్పుడు అల్లు అవింద్ ‘గీత గోవిందం’ చిత్రానికి 10 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 50 కోట్ల మేరకు లాభాలను దక్కించుకున్నాడు. చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించడం వల్ల ఫ్లాప్ అయినా పెద్దగా రిష్క్ ఉండదు. అన్ని రైట్స్ ద్వారా బడ్జెట్ రికవరీ అవుతుంది. అదే పెద్ద బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తే భారీ విజయాన్ని దక్కించుకున్నా కూడా 10 నుండి 15 కోట్లు - మహా అయితే 20 కోట్ల వరకు లాభాలు వస్తాయి.
ఏవో కొన్ని సినిమాలకు మాత్రమే ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో 50 కోట్లు ఆపై లాభాలు వచ్చాయి. బాహుబలి రెండు పార్ట్ లను తీసివేస్తే 50 కోట్లకు పైగా లాభాలు వచ్చిన చిత్రాలను వెదికి వెదికి పట్టుకోవాల్సిందే. ఇప్పటి వరకు కనీసం 10 సినిమాలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 కోట్లు - ఆపై లాభాలను తెచ్చి పెట్టలేదు అంటూ విశ్లేషకులు సైతం అంటున్నారు. కాని గీత గోవిందం చిత్రం మాత్రం 50 కోట్లకు పైగానే లాభాలను తెచ్చి పెట్టింది. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం దాదాపుగా 60 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకుంది. థియేట్రికల్ రైట్స్ కొన్ని ఏరియాల్లో అమ్మిన అల్లు అరవింద్ కొన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేశాడు. కనుక థియేట్రికల్ కలక్షన్స్ ద్వారా 45 కోట్లకు అటు ఇటుగా అల్లు అరవింద్ ఖాతాలో పడ్డాయి.
ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను విడుదలకు ముందే అమ్మడంతో నిర్మాతకు కాస్త లాభాలు తగ్గాయి. అయినా కూడా డబ్బింగ్ రైట్స్ - ప్రైమ్ వీడియో రైట్స్ - ఆన్ లైన్ రైట్స్ ఇలా పలు రకాల రైట్స్ ద్వారా మరో 7 నుండి 10 కోట్ల వరకు వచ్చి ఉండవచ్చు. అంటే మొత్తంగా 55 కోట్లకు అటు ఇటుగానే నిర్మాత అల్లు అరవింద్ ఖాతాలో పడి ఉంటాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇంతటి సంచలన లాభాలను దక్కించుకున్న నిర్మాతగా అల్లు అరవింద్ రికార్డుల్లో నిలిచి పోయాడు. ఈయన గతంలో నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘గజిని’కి ఇదే స్థాయిలో లాభాలు దక్కించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు అంతటి వసూళ్లను దక్కించుకున్నాడు. ఈ విజయంతో అల్లు అరవింద్ ముందు ముందు మరిన్ని చిన్న చిత్రాలను నిర్మిస్తాడేమో చూడాలి.