• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరీ - 'ఫైటర్' పై విజయ్...

పూరీ - 'ఫైటర్' పై విజయ్ దేవరకొండ కామెంట్స్...!

By - Tupaki Desk
Update: 2020-10-10 08:10 GMT
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూరీ - విజయ్ ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ వర్కౌట్స్ చేయడంతో పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాడని తెలుస్తోంది. తాజాగా విజయ్ 'ఫైటర్' సినిమా మరియు పూరీ జగన్నాథ్ ల గురించి చెప్పుకొచ్చాడు. ''నేను ఈ సినిమా కోసం గత 8 నెలలు వర్కౌట్స్ చేశాను. అయితే ఈ మధ్య మోటివేషన్ కోల్పోయాను. మళ్ళీ ఇప్పుడు నాన్-స్టాప్ వర్కౌట్స్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను ఈ మూవీలో ఒక ఫైటర్ పాత్రను పోషిస్తున్నాను. అది 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ అయినా నేను ఒకరిని మట్టికరిపించగల పోరాట యోధుడిలా కనిపించాలి'' అని విజయ్ దేవరకొండ అన్నారు.

''ఇది మనం చూస్తూ వస్తున్న రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. నా తరహాలో ఉండే కమర్షియల్ సినిమా అవుతుంది. నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే.. కమర్షియల్ జోనర్ లో ఇలాంటి సినిమానే చేయాలనుకున్నాను. అయితే కమర్షియల్ సెన్సిబిలిటీలకు పేరుగాంచిన డైరెక్టర్ వల్ల ఈ చిత్రానికి మరింత కమర్షియల్ బ్యాకింగ్ లభించింది'' అని విజయ్ తెలిపారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ.. ''ఆయన నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలలో 'పోకిరి' చాలా ఇష్టం'' అని విజయ్ దేవరకొండ అన్నారు. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తిరిగి స్టార్ట్‌ చేసే ఆలోచన చేస్తున్నారు.
Tags:    
  • Vijay Devarakonda 
  • Puri Jagannadh 
  • Ananya Pandey 
  • Fighter 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS