క్రేజీ ప్రాజెక్ట్ పై డైలమాలో VD..?

Update: 2022-06-22 03:47 GMT
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మరియు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌ పై కేదార్‌ సెలగం శెట్టి ఈ సినిమాని నిర్మిస్తారని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అనే దానిపై స్పష్టత రావడం లేదు.

నిజానికి 'పుష్ప' సినిమా పూర్తైన వెంటనే VD చిత్రాన్ని మొదలు పెట్టాలని భావించారు. అయితే 'పుష్ప' రెండు భాగాలుగా మారడం.. ఫస్ట్ పార్ట్ ఆలస్యమవ్వడం.. అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ 'లైగర్' అనే పాన్ ఇండియా చిత్రాన్ని కంప్లీట్ చేశారు. ఆగస్టులో రిలీజ్ కూడా ప్లాన్ చేసుకున్నారు.

'పుష్ప 2' కు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ముందుగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ నే కంప్లీట్ చేయాలని సుకుమార్ నిర్ణయించుకున్నారు. వీడీ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారు. దీంతో విజయ్ దేవరకొండ బ్యాక్ టూ బ్యాక్ మరో రెండు ఇతర ప్రాజెక్ట్స్ కి కమిట్ అవ్వడమే కాదు.. ఒకేసారి సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

పూరీ - వీడీ కాంబోలో 'జనగణమన' అనే భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వచ్చే ఏడాది విడుదల చేసేలా మేకర్స్ ఈ సినిమాని రెడీ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో శివ నిర్వాణ తో కలిసి 'ఖుషీ' సినిమాని పూర్తి చేస్తాడు.  2021 చివర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాతైనా సుక్కూ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సుకుమార్ 'పుష్ప: ది రూల్' మూవీని ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారనే విషయంలో అధికారిక ప్రకటన ఏదీ లేదు. భారీ అంచనాల నడుమ 'పుష్ప 2' చిత్రాన్ని పూర్తి చేసే వరకూ దర్శకుడు మరో ప్రాజెక్ట్ చేయలేడు. ఇది లేట్ అవడాన్ని బట్టి చూస్తుంటే.. సుక్కూ వచ్చే ఏడాది చివరి వరకు మరో మూవీ చేసే అవకాశాలు లేవు.

మరోవైపు విజయ్ దేవరకొండ 'ఖుషీ' మరియు 'JGM' చిత్రాల తర్వాత దేనికీ ఇంకా కమిట్ అవ్వలేదు. సుకుమార్ ఎప్పుడు ఫ్రీ అవుతారనే క్లారిటీ లేకపోవడంతో.. వీడీ ఈ ప్రాజెక్ట్‌ పై డైలమాలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి 'సుకుమార్‌ - విజయ్‌' మూవీ లేట్ అవుతుండంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.

అయితే ఫాల్కన్‌ క్రియేషన్స్ టీమ్ వీటిని ఖండిస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. దర్శక హీరోల ఇతర కమిట్మెంట్స్ పూర్తైన వెంటనే స్టార్ట్ అవుతుందని.. ఈ కలయిక బిగ్గర్ గా ఉండబోతోందని చెప్పారు. అంతేకాదు 2022 లోనే సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే వేరేగా ఉన్నాయి. మరి 2023 లో అయినా క్రేజీ కాంబోలో సినిమా ఉంటుందేమో వేచి చూడాలి.
Tags:    

Similar News