ఆ హీరోలు..సూర్య మాటను లెక్కచేయట్లేదా..?

Update: 2020-05-08 14:00 GMT
దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఎన్నడూ లేని భారీ నష్టాలలో మునిగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతీ ఏడాది వేసవి కాలం అంటే థియేటర్లలో సినిమాలతో సందడిగా ఉండేది. ఈసారి కరోనా వైరస్ వలన థియేటర్లన్నీ మూతబడి ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ ల టైం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ సినిమాలను ప్రేక్షకులకు చేరవేయాలని ఓటిటి ప్లాట్ ఫామ్ లను ఆశ్రయిస్తున్నారు సినీ హీరోలు. ఇక ఇటీవలే స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'పొన్ మగల్ వందాల్" సినిమా కూడా విడుదలకు సిద్ధం కావడంతో.. థియేటర్లు కూడా మూసి ఉండటంతో ఇప్పట్లో తెరిచేలా లేరని గమనించి ఓటిటిలో రిలీజ్ చేయాలనీ భావించాడు.

అయితే ఓటిటిలో రిలీజ్ చేయడానికి థియేటర్ల సంఘాలు అంగీకరించలేదు. ఒకవేళ వారి మాటలు కాదని ఓటిటిలో రిలీజ్ చేస్తే నీ తదుపరి సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా చేస్తామని హెచ్చరించారట. కానీ సూర్య మాత్రం థియేటర్ సంఘాల మాటలను లెక్క చేయకుండా ఓటిటిలో రిలీజ్ చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా టాప్ హీరో సూర్యనే డిజిటల్ వైపు అడుగులేస్తుంటే.. దళపతి విజయ్, ధనుష్ కూడా డిజిటల్ బాటే పడతారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ 'మాస్టర్' - ధనుష్ 'జగమే తంత్రం' సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీరిద్దరూ సూర్య బాటను ఖండించారు. తమ సినిమాలను డైరెక్ట్ థియేటర్ రిలీజ్ చేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. సినిమా తీసిందే ఫ్యాన్స్ థియేటర్లో ఎంజాయ్ చేస్తారని.. ఆలస్యమైనా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక వీరి సమాధానాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ హీరో సూర్య మాటను ఖాతరు చేయట్లేరని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News