సెక్సీ విలన్ అలా రెచ్చిపోయాడే?

Update: 2016-09-29 15:30 GMT
సాధారణంగా టూర్లకు వెళ్లినపుడో.. ఏదైనా స్పెషల్ గా అట్రాక్ట్ చేయడానికో హీరోయిన్లు రెచ్చిపోవడం చూస్తూనే ఉంటాం. రెచ్చకొట్టే టైపులో పోజులు ఇచ్చి.. అందాల ప్రదర్శన చేసి.. క్లీవేజ్ లు చూపించి.. బ్యాక్ లెస్ లో రెచ్చిపోయి.. ఇలా జనాల అటెన్షన్ డ్రా చేసేందుకు రకరకాలుగా రెచ్చిపోయే భామలు చాలామందే ఉంటారు. కానీ ఓ స్టైలిష్ విలన్ వీళ్లందరినీ మించిపోయాడు.

విద్యుత్ జమాల్ అని ఓ అందగాడైన విలన్ ఉన్నాడు. తెలుగులో ఊసరవల్లి మూవీలో ఎన్టీఆర్ కి పోటీగా నటించినోడే ఈ విద్యుత్ జమాల్. ఇతగాడు రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో జాయిన్ అయ్యాడు. ఇలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో.. త్వరలో మాంచి ఇంటరెస్టింగ్ ఫోటోగ్రాఫ్ లు షేర్ చేస్తానని ప్రామిస్ కూడా చేశాడు. చెప్పినట్లుగానే చెప్పిన కొన్ని రోజులకే ఇలా హాఫ్ నేక్డ్ ఫోటో షేర్ చేశాడు. ఈ రేంజ్ లో బాడీని చూపిస్తూ.. ఇప్పటివరకూ ఏ ఇండియన్ మేల్ యాక్టర్ ధైర్యం చేయలేదనే చెప్పాలి.

హిమాలయాలకు లొంగిపోతున్న విద్యుత్ జమాల్ అంటూ క్యాప్షన్ పెట్టి.. ఇలా సగం ఊడిపోయిన టవల్ తో పడుకుని ఉన్న విద్యుత్ జమాల్.. సడెన్ గా ట్రెండిగ్ అయిపోయాడు.  #VidyutHotInstagramDubut అంటూ ట్విట్టర్ లో ఇతగాడిదే హంగామా. అందుకే కొన్ని రోజుల్లోనే లక్షన్నర మంది ఇతగాడిని ఫాలో అయిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News