ట్రైల‌ర్ టాక్: సుద్ద మూస్కోరా పుల్కా..

తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ అయితే ఏకంగా ప‌ద‌వ స్థానంలో ఉంది. అందుకు ప‌ర్పెక్ట్ గా డ‌బ్బింగ్ కుదిరింది. ఇంగ్లీష్ సినిమా అయినా తెలుగు డైలాగులు మాస్ కి సైతం క‌నెక్ట్ అయ్యేలా రాసారు.

Update: 2024-05-02 10:30 GMT

మార్వెల్ యూనివర్స్ నుంచి రిలీజ్ అయిన `డెడ్‌పూల్` సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అలాగే ఇండియాలో `ఎక్స్ మెన్` ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. రెండు సినిమాటిక్ యూనివ‌ర్శ్ ల్ని అభిమానించే వారెంతో మంది. తాజాగా మార్వెల్‌లోని డెడ్ పూల్ పాత్ర, ఎక్స్ మెన్ రోల్ వోల్వరిన్ కలిసి రాబోతున్న సినిమానే `డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్`.

మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న అతి క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ అయిన ట్రైల‌ర్ యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్ప‌టికే 2.4 మిలియన్‌కుపైగా వ్యూస్ దక్కించుకుంది. 90 వేలకుపైగా వ్యూస్‌తో తెలుగు ట్రైలర్ వీక్షణలు పొందింది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ అయితే ఏకంగా ప‌ద‌వ స్థానంలో ఉంది. అందుకు ప‌ర్పెక్ట్ గా డ‌బ్బింగ్ కుదిరింది. ఇంగ్లీష్ సినిమా అయినా తెలుగు డైలాగులు మాస్ కి సైతం క‌నెక్ట్ అయ్యేలా రాసారు.

Read more!

ట్రిగ‌ర్ నొక్కానంటే బుల్లెట్ న‌వ‌రంద్రాలో ఏ రంద్రం నుంచైనా రావొచ్చు..సుద్ద మూస్కోరా పుల్కా..తొక్క‌లో ప్లాష్ బ్యాక్.. లాంటి డైలాగు ఆక‌ట్టుకుంటుంది. రెండు పాత్ర‌ల మ‌ధ్య అద్భుత‌మైన డ్రామాని హైలైట్ చేసారు. యాక్ష‌న్ సన్నివేశాలు అదిరిపోయాయి. తెలుగులోనే కాదు హిందీ..త‌మిళ వెర్ష‌న్ ట్రైల‌ర్ కి అదే రేంజ్ లో రెస్పాన్స్ వ‌స్తోంది.

ఇందులో డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్, వోల్వరీన్‌గా హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్` లో అత్యంత పవర్‌ఫుల్ విలన్‌ కసాండ్ర నోవాగా ఎమ్మా కొరిన్ ఆకర్షించనుంది.

ఈ పాత్రను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో చూపించడం ఇదే తొలిసారి. అయితే ఎక్స్ మెన్ 97 కార్టూన్ సిరీస్‌లో మాత్రం కసాండ్ర నోవా ఎంతటి పవర్‌ఫుల్ విలన్ అనేది చూపించారు. ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

4
Full View
Tags:    

Similar News