విజయ్ దేవరకొండ.. మరో హిట్ కాంబో..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-05-02 12:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఒక షెడ్యూల్ షూటింగ్ రీసెంట్ గా పూర్తవ్వగా.. కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

ఈ సంగతి పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ ఇటీవల రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజా వారు రాణి గారు ఫేమ్‌ ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ ఒక మూవీ చేయనున్నారట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో విజయ్ తో మరో రెండు సినిమాలు చేస్తానని దిల్ రాజు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీతో పాటు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో మరో సినిమాకు విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పారట. గతంలో వీరిద్దరూ కలిసి టాక్సీవాలా మూవీ కోసం వర్క్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మూవీని నిర్మించనుందని టాక్. ఈ సినిమా కోసం విజయ్‌ తొలిసారి రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతారని సమాచారం.

ఇటీవల కంప్లీట్ స్క్రిప్ట్ ను రాహుల్ నెరేట్ చేయగా.. విజయ్ ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. మే9వ తేదీ విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నవంబర్ లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విజయ్ కు మరో హిట్ ఇవ్వాలని రాహుల్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే టాక్సీవాలా సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు రాహుల్ సాంకృత్యాన్. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఆ మూవీ తెరకెక్కించి అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేశారు. ఈ మూవీని కూడా వైవిధ్యభరితమైన కథతో తీసి ఇంకో హిట్ కొట్టారు. ఇప్పుడు విజయ్ తో మరో సినిమా తెరకెక్కించి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News