పిక్‌ టాక్‌ : అదిరింది అందాల రాశి అందం

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రాశి ఖన్నాకు మంచి పేరును తెచ్చి పెట్టింది

Update: 2024-05-02 11:27 GMT

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రాశి ఖన్నాకు మంచి పేరును తెచ్చి పెట్టింది. పదేళ్లుగా రాశి ఖన్నా వెనక్కి తిరిగి చూడకుండా దూసుకు పోతూనే ఉంది.

హీరోయిన్స్ కాస్త సన్నగా నాజూకుగా ఉంటేనే ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగగలరు. అందుకే రాశి ఖన్నా సహజ పద్దతిలో కేవలం ఆరు నెలల్లోనే బరువు తగ్గి అందంగా తగ్గింది. సాధారణంగా కొందరు బరువు తగ్గితే మొహంలో అందం తగ్గుతుంది అంటారు. కానీ రాశి ఖన్నాకి మాత్రం అందం పెరిగింది.

టాలీవుడ్‌ లో సందడి కాస్త తగ్గినా కూడా లక్కీగా బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. మరో వైపు కోలీవుడ్‌ లో ఈ అమ్మడు సినిమా ఆఫర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముద్దుగుమ్మ రాశి ఖన్నా నెట్టింట తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటోలు పేరుకు తగ్గట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అందాల రాశి ఖన్నా అందం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే అన్నట్లుగా స్టైల్‌ గా బ్లాక్ డ్రెస్ లో కెమెరా కి ఫోజ్ ఇచ్చింది. థైస్ అందాలను చూపిస్తూ ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ పిక్స్ కి కొన్ని నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. భారీ ఎత్తున షేర్‌ అవుతోంది.

Read more!

అందాల రాశి అయిన ఈ అమ్మడి కవ్వించే ఫోటో షూట్‌ ను ఎంతగా చూసినా చూడాలి అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందగత్తె కనుకే బాలీవుడ్‌ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ మరియు తమిళంలో కలిపి అయిదు సినిమాలు చేస్తోంది. మరో వైపు ఒక తెలుగు సినిమా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ అమ్మడి సినిమాల జోరు ఓ రేంజ్ లో ఉంది. అందుకు కారణం ఇలాంటి అందాల ఆరబోత పోటోలు అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News