అడవి శేష్ కు అల్లరోడు అన్నయ్య అవుతారా?

టాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో హీరో అల్లరి నరేష్ ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

Update: 2024-05-02 11:10 GMT

టాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో హీరో అల్లరి నరేష్ ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న మరో కామెడీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. వేసవి కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయింది.

మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తోపాటు మరికొందరు కీలక పాత్రలు పోషించారు. అయితే మేకర్స్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ హీరో అడవి శేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అల్లరి నరేష్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు అడవి శేష్. “ఇండస్ట్రీలో నరేష్ సోదరుడు రాజేష్ నాకు మొదటి స్నేహితుడు. మా అన్న సాయి కిరణ్ కు నరేష్ తెలుసు. నా మొదటి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు నరేష్ గెస్ట్‌ గా వచ్చారు. మా కుటుంబంలో నరేష్‌ ను పెద్ద అన్నయ్యలా ట్రీట్ చేస్తాం. ఆయనెప్పుడు హ్యాపీగా ఉండాలని మేం కోరుకుంటాం. ఈ మూవీ యూనిట్ లోని చాలా మంది నా కెరీర్ మొదట్లో సపోర్ట్ చేశారు. అందుకే ఈ సినిమా నాకు స్పెషల్. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అని అడవి శేష్ తెలిపారు.

Read more!

ఇక ఈ వేడుకలో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నన్ను విజయవంతమైన నటుడిగా తీర్చిదిద్దారు. ఆయన సినిమా టైటిల్‌ తో వస్తున్న ఈ చిత్రానికి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ.. నాంది, నా సామిరంగా చిత్రాలతో నాకు రెండు పెద్ద హిట్‌ లను అందించారు. వారిద్దరికీ నా ధన్యవాదాలు” అని తెలిపారు నరేష్.

‘‘ఒక కొత్త సినిమా తెరకెక్కించి రిలీజ్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ మల్లి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. ఫరియాకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. కోవై సరళ జూనియర్ వెర్షన్ కు జామీ సరిగ్గా సరిపోతుంది. మా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. దయచేసి మీ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు అల్లరి నరేష్. మరి ఈ మూవీతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News