లావు తగ్గినందుకు అంతమాటన్నారుః నటి ఎమోషనల్
సరైనోడు, రాజుగారి గది, రన్ రాజా రన్ వంటి ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్ లో కనిపించి నవ్వించారు విద్యుల్లేఖ. కోలీవుడ్ కు చెందిన ఈ నటి.. తెలుగులోనూ ఎక్కువగానే సినిమాలు చేసింది. చేస్తోంది. అయితే.. ఈ మధ్య ఈమె షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ షాక్ అయ్యారు. లావుగా ఉండే విద్యుల్లేఖ.. ఒక్కసారిగా సన్నగా మారిపోయి ఆశ్చర్యానికి గురిచేశారు.
కఠినమైన వర్కౌట్లు చేసి, బరువు తగ్గారు విద్యుల్లేఖ. అంతేకాదు.. డైట్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. ఇందుకోసం ఓ ట్రయినర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. అయితే.. మొత్తానికి బరువు తగ్గినప్పటికీ.. మారిన తన శరీరాకృతిని చూసి కొందరు కామెంట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
తాను బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు చెప్పారు విద్యుల్లేఖ. దీంతో.. లావు తగ్గడం అనివార్యమైందని తెలిపారు. బాగా కష్టపడి వెయిట్ లాస్ అయినట్టు చెప్పారు. అయితే.. సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫొటోపై నెగెటివ్ కామెంట్లు చాలా చేశారని ఎమోషనల్ అయ్యారు విద్యుల్లేఖ.
ఇక మీద కమెడియన్ పాత్రల్లో కనిపించవా? హీరోయిన్ గా ప్రమోషన్ వచ్చిందా? అంటూ వెటకారంగా కౌంటర్లు వేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘పుడింగి నెంబర్ వన్’ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు విద్యుల్లేఖ. ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె.. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.