డ‌బూ క్యాలెండ‌ర్ పై హాటెస్ట్ లేడీ బాల‌న్

Update: 2021-06-25 16:30 GMT
మ‌హ‌మ్మారీ కార‌ణంగా ఆల‌స్యంగా రిలీజైనా.. డ‌బూ ర‌త్నానీ క్యాలెండ‌ర్ అంత‌ర్జాలంలో వేడి పుట్టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ అంద‌గ‌త్తెల‌తో డ‌బూ క్యాలెండ‌ర్ మునుప‌టిలానే స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. కోవిడ్ వ‌ల్ల ఈసారి ఆల‌స్య‌మైంద‌ని డ‌బూ సారీ చెప్పారు. ఇప్ప‌టికే క్యాలెండ‌ర్ గాళ్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ట్యాలెంటెడ్ న‌టి విద్యాబాల‌న్ క్యాలెండ‌ర్ గాళ్ లుక్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది. డ‌బూ త‌న‌దైన లెన్స్ లో బాల‌న్ ని ఆవిష్క‌రించిన తీరుకు మెచ్చుకుని తీరాల్సిందే. విద్యాబాల‌న్ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ఇది. బ్లాక్ అండ్ వైట్ లాంగ్ కోట్ త‌ర‌హా డిజైన‌ర్ డ్రెస్ ధ‌రించిన బాల‌న్ ఆ న‌డుముకు బ్లాక్ బెల్ట్ తో స‌ప‌రేష‌న్ ఇవ్వ‌డం ఇంప్రెస్ చేస్తోంది.
ఆ వెడ‌ల్పాటి బెల్ట్ హాట్ లేడీ వైబ్ ని క్రియేట్ చేస్తోంది.

బాల‌న్ ఫ్రీస్ట‌యిల్ కి త‌గ్గ‌ట్టే ఆ సింపుల్ నెక్ లైన్ ఎలాంటి అలంక‌ర‌ణ ఆభ‌ర‌ణాల‌తో బ‌రువులు లేకుండా అసభ్యత లేకుండా స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. బాల‌న్ లుక్ ని మ‌రింత హాట్ గా ఆవిష్క‌రించ‌డంలో బ‌ట‌న్ లెస్ లో నెక్ దిగువ బాగాన్ని ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. సీనియ‌ర్ న‌టీమ‌ణి ఎద అందాలు స‌మ్మోహ‌నానికి గురి చేస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ఎంపిక చేసిన ఆ హెయిర్ స్టైల్ ఆక‌ర్ష‌ణ‌ను పెంచింది. విద్యా లైట్ మేకప్ లో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఎలాంటి హ‌డావుడి లేకుండా క్లాస్సీగా మురిపిస్తోంది.

ప్రస్తుతం బాల‌న్ న‌టించిన `షేర్ని` ఓటీటీలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. బాల‌న్ త‌న సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అసాధారణమైన పాత్రలను పోషించింది. షెర్నిలో విన్సెంట్ పాత్ర‌లో మైమ‌రిపించే న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.
Tags:    

Similar News