• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘చిన్నవాడా..’లో ఆమె...

‘చిన్నవాడా..’లో ఆమె చేయదనుకున్నాడట

By - Tupaki Desk
Update: 2016-11-25 22:30 GMT
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో హెబ్బా పటేల్ తో పాటు తమిళ హీరోయిన్ నందిత శ్వేత కథానాయికలుగా నటిస్తున్న సంగతి ముందు నుంచి తెలుసు. ఐతే వాళ్లు మాత్రమే హీరోయిన్లు అనుకుని సినిమాకు వెళ్లిన వాళ్లకు.. అవికా గోర్ రూపంలో సర్ప్రైజ్ ఎదురైంది. నిడివి తక్కువే అయినా.. కీలకమైన పాత్రలో ఆకట్టుకుంది అవికా. ఐతే ఈ పాత్రను ముందు స్వాతికి ఆఫర్ చేయగా.. ఆమె నో చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. అందులో వాస్తవమెంతో కానీ.. అవికా అసలు ఈ పాత్ర ఒప్పుకుంటుందా అని సందేహించాడట దర్శకుడు వీఐ ఆనంద్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ థ్యాంక్స్ మీట్లో మాట్లాడుతూ ఆనంద్ ఈ విషయం చెప్పాడు.

‘‘అవికాను ఈ పాత్రకు అడుగుదాం అనుకున్నపుడు.. ఈ క్యారెక్టర్ లెంగ్త్ పది నిమిషాలే కాబట్టి తను ఒప్పుకోకపోవచ్చని కొందరు అన్నారు. నేను కూడా సందేహించాను. కానీ అవికా మాత్ర క్యారెక్టర్ గురించి చెప్పగానే.. లెంగ్త్ గురించి ఆలోచించకుండా ఈ సినిమా చేస్తానని ఒప్పుకుంది. అవికాతో పాటు ఆమె తండ్రి నాకిచ్చిన సపోర్ట్ ను మరిచిపోలేను. సినిమాలో ముందు చిత్రీకరించింది అవికా ఎపిసోడే. సినిమాకు అది హైలైట్ గా నిలిచింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేను. ఇది నా మనసుకు నచ్చిన సినిమా. దీని కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డాను. ఎన్నోసార్లు రీరైట్ చేసి.. పకడ్బందీగా స్క్రిప్టు తీర్చిదిద్దాను. 2000వ సంవత్సరంలో నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఎంతో కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. వాటన్నింటికీ ఇప్పుడు సరైన ఫలితం దక్కినట్లుంది. నిఖిల్ కథ చెప్పగానే నమ్మి సినిమా చేశాడు. తనే నిర్మాతను సెట్ చేశాడు. అందరూ నాకెంతగానో సహకరించారు’’ అని ఆనంద్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Vi anand 
  • Avika Gor 
  • Ekkadiki Pothavu Chinnavada Movie 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS