• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇద్దరు హీరోల మధ్య ఒక...

ఇద్దరు హీరోల మధ్య ఒక దర్శకుడు

By - Tupaki Desk
Update: 2018-05-23 07:09 GMT

ఎక్కడికి పోతావు చిన్నవాడాతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు విఐ ఆనంద్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. భిన్నమైన కథలతో ఊహకందని కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ కు ఒక్క క్షణం సినిమా  పెద్ద ట్విస్టే ఇచ్చింది. నిజానికి మంచి కాన్సెప్ట్ అయిన ఆ కథను చెప్పే విధానంలో కొంత తడబాటుకు గురి కావడంతో పాటు రిలీజ్ టైం ని సరిగా ప్లాన్ చేయకపోవడంతో ఫైనల్  రిజల్ట్ నిరాశనే మిగిల్చింది. దాంతో తన కొత్త సినిమా విషయంలో డైలమాలో పడ్డాడు ఆనంద్. రవితేజకు  లైన్ చెప్పాడు అని వార్తలు వచ్చాయి కానీ పూర్తి వెర్షన్ వింటే కానీ చెప్పలేను అనే సమాధానం రావడంతో దానికి టైం పట్టేలా ఉంది. అందులో రవితేజ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనే టాక్ కూడా వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ లో ఇదే ప్రశ్న అడిగినప్పుడు  రవితేజ దాటవేసి టైం వచ్చినప్పుడు చెబుతాను అని సమాధానం చెప్పడం గమనార్హం. దానికి తోడు అమర్ అక్బర్ ఆంటోనీ కోసం 50 రోజులు యుఎస్ వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పట్లో ఇది తేలేది కాదు.

మరోవైపు విఐ ఆనంద్ అల్లు అర్జున్ కు కూడా ఒక కథ చెప్పినట్టు తెలిసింది. ఒక్క క్షణం మేకింగ్ టైంలోనే శిరీష్ నుంచి ఫీడ్ బ్యాక్ అందుకున్న బన్నీ అప్పట్లోనే ఆసక్తి చూపించాడని వార్తలు వచ్చాయి. కానీ అది విడుదల అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు బన్నీ రిస్క్ చేసే స్థితిలో లేడు. నా పేరు సూర్య ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో ఏడాది పాటు పడిన కష్టం బూడిదపాలు కావడం బాగా ఇబ్బంది పెడుతోంది. అందుకే ఆచితూచి అడుగులు వేసే దిశగా నిరయాలు తీసుకుంటున్నాడు. ఎస్ కానీ నో కాని ఏది చెప్పలేదని తెలిసింది. ఇప్పుడు విఐ ఆనంద్ ని ఇదే ఇబ్బందులో నెడుతోంది. కొంతకాలం వేచి చూసి రవినో లేక బన్నీనో ఎవరో ఒకరు ఒకే చేస్తారని పక్కాగా తెలిస్తే కాస్త ఆలస్యమైనా ఎదురు చూడొచ్చు. కానీ పరిస్థితి అలా లేదు. మరి ఆనంద్ వెయిట్ చేస్తాడా లేదా ఎవరైనా మీడియం రేంజ్ తో హీరో వేరేది పట్టాలు ఎక్కిస్తాడా వేచి చూడాలి
Tags:    
  • VI Anand 
  • Ravi Teja 
  • Allu Arjun 

Similar News

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS