ఇక్కడికి అక్కడికి ఎంతో తేడా టాలీవుడ్ లక్కీ
కరోనా కారణంగా గత ఏడాది దాదాపుగా 10 నెలలు ఇండస్ట్రీకి పూర్తిగా నష్టాలనే మిగిల్చింది. థియేటర్లు గత ఏడాది చివర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయినా కూడా ఈ ఏడాది ఆరంభం నుండే పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా థియేటర్లకు నూరు శాతం ఆక్యుపెన్సీ ఇచ్చిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ నుండి వారంకు రెండు మూడు సినిమాల చొప్పున విడుదల అవుతున్నాయి. ఇతర భాషల్లో కూడా సినిమాలు వరుసగా వస్తున్నాయి. కాని తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పరిస్థితి వేరే భాషల పరిశ్రమల్లో లేదు. ఇతర భాషల్లో ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి బాక్సాఫీస్ హిట్ గా నిలువలేదు. హిందీ.. తమిళం.. కన్నడం ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాలు కూడా వసూళ్ల పరంగా చాలా నిరుత్సాహపర్చుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. క్రాక్ నుండి మొదలుకుని మొన్నటి జాతి రత్నాలు వరకు పాజిటివ్ టాక్ దక్కించుకున్న సినిమాలకు కాసుల వర్షం కురుస్తుంది. ఉప్పెన సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న చిత్రం అయిన జాతి రత్నాలు 50 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. టాక్ పాజిటివ్ గా వస్తే సినిమా వసూళ్లు సాలిడ్ గా ఉంటున్నాయి. టాలీవుడ్ లో ఉన్న పరిస్థితి వేరే ఇండస్ట్రీలో కనిపించడం లేదు. కరోనాకు ముందు బాలీవుడ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉండేవి. కాని ఇప్పుడు అసలు ఓపెనింగ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేట్లుగా లేవు.
ఇటీవల కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన 'యువరత్న' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. కాని కరోనా కారణంగా అక్కడ థియేటర్లకు జనాలు రావడం లేదు. సినిమా వసూళ్లు మరీ పూర్ గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం థియేటర్ల సీటింగ్ కెపాసిటీని 50 శాతం కు తగ్గించింది. దాంతో యువ రత్నకు మరింత నష్టం తప్పదంటున్నారు. ఇదే పరిస్థితి ఇతర భాషల్లో కూడా ఉంది. ఈ విషయంలో టాలీవుడ్ మాత్రం చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా మునుపటి పరిస్థితులు వచ్చేశాయి.