రాజుగారి ఇంటబ్బాయికి డైరెక్టర్ ఫిక్స్!

Update: 2018-07-21 07:57 GMT
స్టార్ కిడ్స్ లేని టాలీవుడ్ ను ఊహించడం చాలా కష్టం. సొంతంగా హీరో అయిన వాళ్ళ సంఖ్య తెలుగులో చాలా తక్కువ. అయినా కొత్త హీరోలు సినిమా ఫ్యామిలీల నుండి వస్తూనే ఉన్నారు.  రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీ వంతు వచ్చింది.  దిల్ రాజు కజిన్ అయిన శిరీష్ తనయుడు అశిష్ రెడ్డి త్వరలో సినిమాల్లోకి వస్తాడని ఈమధ్యే దిల్ రాజు స్వయంగా చెప్పాడు.  సినిమా పేరు 'పలుకే బంగారమాయెనా' అని కూడా చెప్పాడు.

ఈ సినిమా గురించి మరికొంత సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.  ఈ సినిమాను నూతన దర్శకుడు సతీష్ తెరకెక్కిస్తాడట.  సతీష్ ఇదివరకూ వేణు శ్రీరామ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాడట.  ఈ స్టొరీని రెండేళ్ళ క్రితమే దిల్ రాజుకు వినిపించాడట. స్టొరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ని డెవలప్ చేయమని - కొన్ని మార్పులను కూడా సూచించాడట.  అప్పటినుండి సతీష్ ఆ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట.  రీసెంట్ గా దిల్ రాజు ఫైనల్ వెర్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మరోవైపు కొత్త హీరో అశిష్ తన టాలెంట్ ను మెరుగుదిద్దుకునే ప్రయత్నాలలో ఉన్నాడట.  యాక్టింగ్ ట్రైనింగ్ తో పాటు డాన్సులు - ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడట.  శేఖర్ మాస్టర్ డాన్స్.. వెంకట్ మాస్టర్ స్టంట్స్ లో తనకు ట్రైనింగ్ ఇస్తున్నారట.  సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.
Tags:    

Similar News