ఆయనకు తప్ప, అందరి చేతిలో ఉన్నాయ్

Update: 2015-09-13 15:30 GMT
టాలీవుడ్ ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత హుషారుగా ఉంది. బాహుబలి ఇచ్చిన జోష్ కి కొత్త మార్కెట్ లు ఓపెన్ అయ్యాయి. ఏళ్ల తరబడి థియేటర్లకు దూరమైన వాళ్లు కూడా.. ఇప్పుడు మళ్లీ వస్తున్నారు. ఈ ఘనత బాహుబలిదే అయినా.. ఆ ట్రెండ్ కంటిన్యూ చేయడంలో శ్రీమంతుడు - భలేభలే మగాడివోయ్ ల కష్టం కూడా ఉంది.

విడుదలైనవే కాదు.. సెట్స్ మీద కూడా అనేక క్రేజీ ప్రాజెక్టులు ఉండడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలను చూసుకుంటే.. చిన్నా పెద్దా సహా అందరి చేతిలోనూ సినిమాలున్నాయి. హీరోయిన్ ల విషయానికొస్తే.. ఇక కాజల్ పని అయిపోయిందనుకుంటే.. పవన్ - మహేష్ ల పక్కన ఛాన్సుల దక్కాయి. తెలుగు గుడ్ బై చెప్పేసినట్లుగా కనిపించిన సమంత కూడా రెండు మూవీలు ఒకేసారి చేసేస్తోంది. ఇప్పుడు చిరంజీవి సహా యాక్ట్ చేసేస్తున్నారు. ఎలాంటి రెసిషన్ లో అయినా.. వరుస సినిమాలు చేసే వెంకీ ఒక్క ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేయకపోవడం ఒకటే లోటు.

నిజానికి వెంకీ వెనుక చాలామంది డైరక్టర్లు ఉన్నారు. మారుతి - దేవ కట్ట - దశరథ్‌.. ఇలా అందరూ ఆయనకు స్ర్కిప్ట్‌ చెప్పి సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. కాని వెంకీ మాత్రం ఎవ్వరికీ సిగ్నల్‌ ఇవ్వలేదు. స్టిల్‌ ఇంకా ది బెస్ట్‌ స్ర్కిప్ట్‌ ఇవ్వాలని చూస్తున్నాడు.
Tags:    

Similar News