'ఎఫ్‌3' తర్వాత వెంకీ ఇంట్రెస్టింగ్‌ లో వెంకీ

Update: 2020-09-23 04:15 GMT
తమిళ సూపర్‌ హిట్‌ మూవీ 'అసురన్' తెలుగు రీమేక్‌ 'నారప్ప'ను వెంకటేష్‌ అతి త్వరలో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న 'నారప్ప' రీమేక్‌ షూటింగ్‌ ను వచ్చే నెల నుండి పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల నుండి నెలన్నర రోజుల్లో నారప్ప షూటింగ్‌ పూర్తి చేయబోతున్నారు. ఆ వెంటనే 'ఎఫ్‌ 3' సినిమా షూటింగ్‌ లో వెంకటేష్‌ పాల్గొనబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ నుండి వెంకీ కొత్త సినిమాలో నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వెంకీ వద్ద పలువురు దర్శకులు క్యూలో ఉన్నారు. తాజాగా తమిళ దర్శకుడు మిలింద్‌ రావ్‌ కూడా ఆ జాబితాలో చేరాడని సమాచారం. విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరున్న ఈయన మొన్నటి వరకు రానాతో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అబ్బాయితో సినిమా కంటే ముందు బాబాయితో సినిమాను చేసేందుకు దర్శకుడు మిలింద్‌ రెడీ అవుతున్నాడట. దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌ కు ఫిదా అయిన వెంకీ ఖచ్చితంగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడట.

మిలింద్ రావ్‌ ప్రస్తుం వెంకీ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అతి త్వరలోనే మరోసారి వెంకీని కలిసి పూర్తి స్క్రిప్ట్‌ ను వినిపించే అవకాశం ఉందని సమాచారం. ఎఫ్‌ 3 సినిమా కోసం వెంకీ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. దర్శకుడు అనీల్‌ రావిపూడి చాలా తక్కువ సమయంలోనే ఆ సినిమాను పూర్తి చేయాలని స్క్రిప్ట్‌ వర్క్‌ ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. ఎఫ్‌ 3 షూటింగ్‌ పూర్తి అయినా కాకున్నా వెంకీ.. మిలింద్‌ ల మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌ కు ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. ఇంట్రెస్టింగ్‌ గా మిలింద్‌ చెప్పిన కథ ఉండటం వల్ల వెంకీ మామ చాలా ఆ సినిమా చేసేందుకు ఆతృతతో ఉన్నాడట.
Tags:    

Similar News