ఒక కులం అండతో నాయకుడైనా .. ప్రత్యర్థి సామాజిక వర్గం యువతిని పెళ్లాడి.. ప్రత్యర్థి కులాల పేదల్ని ఆదుకుని.. ఏ ఒక్క కులానికో పరిమితం కాని నాయకుడయ్యాడు వంగవీటి రంగా. పేద- బడుగు-బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా అవతరించాడు. ఒక రకంగా అతడు కాపు కమ్యూనిటీ నుంచి పుట్టుకొచ్చిన రాబిన్ హుడ్ అని చరిత్ర చెబుతోంది. బెజవాడ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం సాగించిన మేటి నాయకుడిగా వంగవీటి రంగా ప్రస్థానం ఎంతో గొప్పది. బెజవాడ రౌడీ రాజకీయాల్లో అతడి హత్య పేదల గుండెల్ని మరిగించింది. వంగవీటి రంగాకు ధీటైన వర్గంగా బెజవాడ రాజకీయాల్లో ఎదిగిన దేవినేని నెహ్రూ సోదరుల ప్రస్థానం అంతే గొప్పది. రంగా - నెహ్రూల మధ్య స్నేహం స్థానంలో శత్రుత్వం పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే అవన్నీ చరిత్రలో నిక్షిప్తం అయ్యి ఉన్న గొప్ప నగ్నసత్యాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెజవాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగవీటి రంగా .. దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్దరి కథతోనే సినిమా తెరకెక్కుతోంది. దేవినేని కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `దేవినేని` అనే టైటిల్ ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. `బెజవాడ సింహం` అనేది ఉపశీర్షిక. శివనాగు దర్శకత్వంలో ఆర్‌టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు.
దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా .. వంగవీటి రంగా పాాత్రలో పరిశ్రమలో అందరికీ సుపరిచితుడు.. మీడియా వ్యక్తి అయిన ఓ సర్ ప్రైజ్ స్టార్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈనెల 4న వంగవీటి రంగా 72 వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. బెజవాడలో జరిగిన ఇద్దరు మహానాయకుల మధ్య జరిగిన యదార్థ కథను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిస్తున్నామని తెలిపారు. నిర్మాత రామూరాథోడ్ మాట్లాడుతూ .. ``దేవినేని - రంగా పాత్రలు ఒకదానితో ఒకటి పోటాపోటీగా ఉంటాయి. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలా నేచురల్‌గా వుంటుంది. దేవినేని పాత్రలో తారకరత్న అద్భుతంగా నటించారు. రంగా పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుంది`` అని తెలిపారు.
ఇదివరకూ దేవినేనిగా తారకరత్న లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రంగా సోదరుడు వంగవీటి రాధా పాత్రలో బెనర్జీ నటిస్తుండగా.. దేవినేని గాంధీగా శివారెడ్డి (మిమిక్రి), రత్నకుమారి పాత్రలో తమిళనటి ధృవతార.. చలసాని వెంకటరత్నం పాాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నారు.
నెహ్రూ ప్రస్థానం మరింత వివరంగా పరిశీలిస్తే.. దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు.. మాజీ రాష్ట్ర మంత్రి. విజయవాడలో కీలక నేతగా ఈయనకు పేరుంది. కంకిపాడు నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు.. విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ఒకసారి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తరువాత తెలుగు దేశం పార్టీలో చేరాడు. తరువాత కొద్ది రోజులు కాంగ్రెస్ ఉండి మళ్ళీ తెలుగు దేశంలో చేరారు. ప్రస్తుతం నెహ్రూ వారసుడు అవినాష్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే.