మరో లైన్ వినిపించి ఓకే చేయించాడా?
ఏడాది పాటు ఒక హీరో కోసం వేచి చూసి బౌండెడ్ స్క్రిప్టు రెడీ చేసి వినిపించాక సింపుల్ గా నచ్చలేదు! అని తిరస్కరిస్తే ఆ దర్శకుడి పరిస్థితేమిటి? గత ఏడాది సుకుమార్ ఇలానే ఝలక్ తిన్నాడు. స్క్రిప్టు నచ్చలేదని మహేష్ నిర్మొహమాటంగా చెప్పేయడం సుక్కూని నిరాశపరిచింది. అనంతర పరిణామం తెలిసిందే. ఇక సుక్కూతో పోలిస్తే వంశీ పైడిపల్లి వ్యవహారం అలా లేదు.
మహేష్ కోసం ఏడాది పైగానే వర్క్ చేశాడు. బౌండ్ స్క్రిప్టు రెడీ చేసి వినిపించినా మహేష్ సుక్కూతో అన్నట్టే నచ్చలేదని అన్నందుకు అతడేమీ చిన్నబుచ్చుకోలేదు. తనపై మీడియా కథనాలు ఇబ్బంది పెట్టాయని ఆవేదన చెందినా.. తన ప్రయత్నం మాత్రం విడువ లేదు. ఇప్పటికీ అతడు మహేష్ ని మెప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంతకు ముందు వినిపించిన కథ కాకుండా ఇప్పుడు మరో కొత్త కథను బయటకు తీశాడట. ఆ లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. అయితే లైన్ వినిపిస్తే సరిపోతుందా? పైడిపల్లి పూర్తిగా బౌండ్ స్క్రిప్టు ఓకే చేయించుకోవాలి. అంటే మరో ఏడాది పాటు శ్రమించాల్సి ఉంటుందేమో!
ఈలోగానే మహేష్ - పరశురామ్ మూవీ సెట్స్ కెళుతుంది. అలాగే మెగాస్టార్ 152 చిత్రీకరణ లోనూ మహేష్ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక ఈ మూవీలో మహేష్ .. చరణ్ ఇద్దరిలో ఎవరికి ఛాయిస్ అన్నది ఇంకా తేలాల్సి ఉంటుంది. ఇకపోతే మహేష్ కోసం బాలీవుడ్ ఫిలింమేకర్స్ సాజిద్ ఖాన్ ఎదురు చూస్తున్నారని ఇటీవల ఓ వార్త వైరల్ అయ్యింది. అక్కడ రణవీర్ - మహేష్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ కి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యం లో మహేష్ తదుపరి నటించే సినిమా ఏది? ఆ తర్వాత ఎవరికి ఖాయం చేస్తారు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ 26 ఛాయిస్ పరశురామ్ కి ఖాయం అయినట్టేనన్న లీకులు ఇప్పటికే అందిన సంగతి తెలిసిందే