అందాల వాణి హిట్ బోణి కొట్టేదెప్పుడో..!
‘ఆహా కల్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల యువనటి వాణి కపూర్. తెలుగు ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేక పోయింది. ఈ అందమైన పొడుగు కళ్ల సుందరి.. సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటలేక పోతుంది. అలాగని సినిమాలు చేయకుండా ఖాళీగా కూర్చోవడం లేదు. అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్‌గా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్' సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించారు. అయితే సినిమాలంటే ఎంతో ఇష్టం ఉన్న ఈ భామ కాస్టింగ్ కౌచ్ భయంతో మొదట్లో సినిమాల్లోకి రావడానికి భయపడిందట.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన వాణి.. తన పర్సనల్ విషయాలను తాజాగా బయట పెట్టింది. ‘‘ఢిల్లీలో పుట్టి పెరిగిన నేను పెద్ద ఫుడ్ లవర్. సినిమాలంటే చాలా ఇష్టం.. కొత్త పాత హిట్ ప్లాప్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలు తెగ చూసేదాన్ని. మాకు ఫామ్‌హౌస్ ఉంది. అందులో ఎన్నో జంతువులు ఉండేవి. కుక్కలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు, పిల్లులు.. ఇలా అన్నీ ఉండేవి. అది ఒక మినీ జూ లాగే ఉండేది. నాకు కుక్కపిల్లలంటే చచ్చేంత ఇష్టం. ఎంతంటే వీధి కుక్కల్ని కూడా ఇంటికి తీసుకువచ్చి శుభ్రపరిచేదాన్ని. మా ఇంట్లో అంతా మిలట్రీ డిసిప్లేన్. ఆ డిసిప్లేన్ భరించలేక ఒక్కోసారి ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగిరి పోవాలనిపించేది.
ఢిల్లీ హాస్టల్ లో ఉండి టూరిజం స్టడీస్ కంప్లీట్ చేశాను. మోడలింగ్ అంటే మా నాన్నకి ఇష్టంలేదు. ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చినా.. అమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. మా అక్కకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లయింది. నాకు స్వతంత్రభావాలు ఎక్కువ. మోడలింగ్ చేసేటప్పుడు లావుగా ఉండేదాన్ని. ఆ తరువాత రకరకాల వ్యాయమాలు చేసి బరువు తగ్గాను. కాస్టింగ్ కౌచ్ భయంతో సినిమాల్లోకి రావడానికి భయపడ్డాను. పేరున్న మోడలింగ్ ఏజెన్సీ నుంచి రావడం వల్ల నాకు ఎలాంటి సమస్య రాలేదు" అంటూ వివరించింది వాణి.