శ‌ర్వా - శ్రీ‌ను వైట్ల సినిమా ప‌రిస్థితేంటీ?

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన శ‌ర్వానంద్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బ‌రిలో నిలిచి `నారీ నారీ న‌డుమ మురారి` మూవీతో సూప‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-04-17 15:30 GMT

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన శ‌ర్వానంద్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బ‌రిలో నిలిచి `నారీ నారీ న‌డుమ మురారి` మూవీతో సూప‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో న‌లిచి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. పోటీలో పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నా వాట‌న్నింటినీ ఓవ‌ర్ టేక్ చేసి సూప‌ర్ హిట్ అనిపించుకుంది. దీంతో శ‌ర్వా మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు. మాంచి జోష్ మీదున్నాడు.

`నారీ నారీ న‌డుమ మురారీ` స‌క్సెస్ త‌రువాత శ‌ర్వానంద్ నుంచి వ‌చ్చిన మూవీ `బైక‌ర్‌`. డా. రాజ‌శేఖర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్‌తో సూప‌ర్ హిట్ అనిపించుకుంది. వ‌సూళ్ల ప‌రంగానూ మంచి ఫిగ‌ర్ల‌ని దాటిన ఈ మూవీపై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. కింగ్ నాగార్జున నుంచి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌ర‌కు సినిమాని, ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌ని ప్ర‌త్యేకంగా అభినందించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ థియేట‌ర్లలో విజ‌య‌వంతంగా ర‌న్న‌వుతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత శ‌ర్వానంద్ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల‌తో ఓ భారీ మూవీకి శ్రీ‌కారం చుడుతున్నాడంటూ వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా రోజులుగా జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా త‌న క్రేజ్‌ని కోల్పోయిన శ్రీ‌ను వైట్ల ..శ‌ర్వా సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగానే శ‌ర్వాతో ట్రావెల్ అవుతున్నారు.

శ్రీ‌ను వైట్ల శైలి కామెడీతో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా దీన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి 2027 సంక్రాంతికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు. కానీ అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. దానికి ప్ర‌ధాన కార‌ణం ఈ మూవీ అనుకున్న టైమ్‌కి ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌క‌పోవ‌డ‌మే. కార‌ణం బ‌డ్జెట్‌. ముందు అనుకున్న బ‌డ్జెట్‌కు మించి అవుతుండ‌టంతో మేక‌ర్స్ వెనుక‌డుగు వేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సినిమా మేక‌ర్స్ నుంచి చేతులు మారే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌రుస ఫ్ల‌పుల‌తో ఫామ్‌ని కోల్పోయిన శ్రీ‌ను వైట్ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమా చేయ‌డం ప్ర‌మాద‌మ‌ని మేక‌ర్స్ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఆ కార‌ణంగానే వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి `జార్జ్ కృష్ణ` అనే టైటిల్ వినిపిస్తోంది.

Tags:    

Similar News