• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రియాంక.. జగమెరిగిన...

ప్రియాంక.. జగమెరిగిన మోసగత్తె!

By - Tupaki Desk
Update: 2018-12-06 05:38 GMT
బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను అందరూ దీవిస్తుంటే, ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని, నిక్‌ను ఆమె వంచించి పెండ్లి చేసుకుందంటూ చెత్తంతా వెళ్లగక్కింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలేనంటూ నిరసనలు ప్రారంభం కావడంతో ఆ పత్రిక చివరకు క్షమాపణలు చెప్పింది.

ది కట్ మ్యాగజైన్‌కు సంబంధించిన వెబ్‌ సైట్‌ లో ప్రియాంక-నిక్‌జోనాస్‌లది నిజమైన ప్రేమేనా? అనే శీర్షికతో ఈ కథనం ప్రచురితమైంది. జర్నలిస్ట్ మరియా స్మిత్ రాసిన ఈ కథనంలో అనేక అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ``పాపం నిక్.. అందరు కుర్రాళ్ల లాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రేమాయణం సాగించి వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆమె జగమెరిగిన మోసగత్తె. కుట్ర పన్ని.. పెండ్లి పేరుతో నిక్‌ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవ శిక్షను విధించింది`` అంటూ రాసుకొచ్చింది. ఒక ఆసియా మహిళ అమెరికా సినీ, టీవీ రంగాల్లో రాణించడాన్ని జీర్ణించుకోలేకే ఇలా విషం కక్కుతున్నారని బాలీవుడ్ తారలు సోనమ్‌కపూర్ - స్వరాభాస్కర్ - గాయని సోనా మహాపాత్ర విమర్శించారు. నిక్ జోనాస్ సోదరి జోయ్ జోనాస్, ఆమె ప్రియుడు సోఫీ టర్నర్ కూడా ఈ కథనంపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి కథనాన్ని ప్రచురించినందుకు ఆ మ్యాగజైన్ సిగ్గుపడాలి అని వారు మండిపడ్డారు. నిరసనలు తీవ్రమవుతుండటంతో ది కట్ దిగివచ్చింది. ఆ కథనాన్ని తొలగిస్తున్నామని.. క్షమాపణలు చెప్పింది.
Tags:    
  • US Magazine 
  • Priyanka Chopra 
  • Telugu News 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS