రంగీల మళ్లొస్తోంది

Update: 2015-08-02 12:29 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ రంగీల పెను సంచలనం ఆరోజుల్లో. ఊర్మిల మఠోండ్కర్‌ .. అనే మెరుపు వల్లే అది సాధ్యమైంది. యాయిరే యాయిరే .. రం రం రంగీలరే.. అంటూ ఊర్మిల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అందుకే బాలీవుడ్‌ హిస్టరీలో ఒకానొక క్లాసిక్‌గా ఈ సినిమా గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే అంతటి సంచలనం ఆ తర్వాత బాలీవుడ్‌ దశ దిశ నిర్ధేసిస్తుందని అనుకుంటే కాలక్రమంలో కనుమరుగైపోయింది. ఈ అమ్మడు సత్య, మనీ మనీ, అనగనగా ఒకరోజు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. రామూ తీసిన ప్రతి సినిమాలోనూ ఆరోజుల్లో కథానాయిక తనే. కాబట్టి కెరీర్‌ పరంగా ఢోఖా లేకుండా పోయింది. అయితే ఈ భామ ఇంతకాలం హైడ్‌ లోనే ఉండిపోయింది.

ఇప్పుడు మరోసారి వెండితెరపై నటించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇటీవలే ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇచ్చిన ఓ పార్టీలో ఊర్మిల అనుకోకుండా ప్రత్యక్షమైంది. ఇదే వేడుకలో కరణ్‌ జోహార్‌, జోయా అక్తర్‌ వంటి ప్రముఖులు ప్రత్యక్షమయ్యారు. అంతేనా కరణ్‌ అయితే ఊర్మిలను చూసి ఫ్లాటైపోయి.. తను నటిస్తానంటే స్క్రిప్టు రెడీ అని చెప్పాడు. కాబట్టి ఊర్మిల మరోసారి ముఖానికి రంగేసుకుని తెరపైకి రావడం ఖాయం అనే అనిపిస్తోంది. వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News