లైంగిక దాడుల‌కు పాల్ప‌డేది ప‌రిశ్ర‌మ పెద్ద మ‌నుషులే!

Update: 2021-12-26 00:30 GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పై ఎలాంటి ఉద్య‌మాలు తెర‌పైకి వ‌చ్చాయో తెలిసిందే. గాయ‌ని చిన్మ‌యి ముందుకొచ్చి కాస్టింగ్ కౌచ్ పై తొలిసారి గ‌ళం విప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌ముఖ లిరిసిస్ట్ వైర‌ముత్తు త‌న‌ని వేధించార‌ని చిన్మ‌యి ఫిర్యాదు చేసింది. దానిపై విచార‌ణ జ‌రిగినా చివ‌రికి ఎలాంటి రిజ‌ల్ట్ లేదు. అటుపై అన్ని భాష‌ల న‌టీమ‌ణులు ముందుకొచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయ‌పై ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు. అటుపై మీటూ ఉద్య‌మం ఏ స్థాయిలో తెర‌పైకి వ‌చ్చిందో తెలిసిందే.

లైంగిక వేధింపుల‌కు గురైన వారంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా మీటూ ఉద్యమంలో భాగ‌మ‌య్యారు. తాప్సీ- వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ స‌హా చాలా మంది అగ్ర నాయిక‌లు కూడా లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే ప్ర‌స్థావించారు. త‌మ‌కు ఎదురైన‌వి చెప్పుకుని ఆవేద‌న చెందారు. దీనిని నిలువ‌రించేందుకు టాలీవుడ్ లో మ‌హిళా సెల‌బ్రిటీల క‌మిటీల్ని నియ‌మించారు.

తాజాగా బాలీవుడ్ న‌టి.. బిగ్ బాస్ ఫేం ఉర్పీ జావెద్ కూడా లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాన‌ని తెలిపింది. ``ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది అమ్మాయిల్లాగే నేను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒక‌త‌ను బ‌ల‌వంతం చేయాల‌ని చూసాడు. కానీ అదృష్టం కొద్ది ఆ స‌మ‌యంలో బ‌య‌ప‌డ్డాను. ఆ త‌ర్వాత అలాంటి వేధింపులు త‌ప్ప‌లేదు.

ప‌రిశ్ర‌మ‌లో పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి అవుతున్న వారే ఇలాంటి వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. వాళ్లు తులుచుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌రు. ఇండ‌స్ట్రీ నుంచి త‌రిమేయ‌గ‌ల స‌త్తా వారిది. అందుకే నోరు మూసుకుని ఉండాల్సి వ‌స్తుంది. అందుకే నేను వాళ్ల పేర్లు బ‌య‌ట పెట్ట‌డం లేదు`` అని తెలిపింది.

ఉర్పీ జావెద్ `బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా` సీనియ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత `మేరి దుర్గ`తో న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. అలాగే హిందీ బిగ్ బాస్ ఓటీటీ ప్రోగ్రామ్ లోనూ కంటెస్టెంట్ గా ఎంపికైంది. ఇక సోష‌ల్ మీడియాలో ఉర్పీ జావెద్ మంట‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోలు వీడియోల‌తో ఆక‌ట్టుకోవ‌డం అమ్మ‌డి స్పెషాల్టీ. తాజాగా స‌న్నీలియోన్ మ‌ధుబన్ పాట‌కు కూడా ఉర్ఫీ స్టెప్పులేయ‌గా ఆ వీడియో వైర‌ల్ అయ్యింది.


Tags:    

Similar News