మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. విజయ్ సేతుపతి కీలక పాత్రధారి. బుచ్చిబాబు సన దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ కథను అందించింది. మైత్రి మూవీమేకర్స్- సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమికుల రోజు కానుకగా రెండ్రోజుల ముందే ఈ నెల 12న మూవీ రిలీజవుతోంది.
తాజాగా హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దేవీశ్రీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఈ మూవీలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి రాయణం అనే పాత్రలో నటించారు. ఇక సేతుపతి విలనీకి తగ్గట్టే నేపథ్య సంగీతం కుదిరిందని.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా పూర్తయ్యాక సినిమా చూసిన దర్శకుడు దేవీశ్రీతో ఓ మాటన్నారట.. ``ఈ సినిమా చూశాక విజయ్ సేతుపతితో ఎవ్వరూ సెల్ఫీలు తీసుకోరేమో సర్`` అని అన్నారట. అంతగా ఆ పాత్ర భయపెడుతుంది. నేపథ్య సంగీతం భయపెట్టేస్తుందని బుచ్చిబాబు అన్నారట. తనకు ఇచ్చిన కితాబు గురించి దేవీశ్రీ స్వయంగా ఉప్పెన ప్రీఈవెంట్లో వెల్లడించారు.
నిజానికి ఈ సినిమా పాటల్ని చార్ట్ బస్టర్స్ జాబితాలో చేర్చిన ఘనత దేవీదే. పోస్టర్లు.. టీజర్లు.. ట్రైలర్.. పాటలు అన్నీ యువతరానికి నచ్చాయి. మూవీ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినమాపై ఇంతటి భారీ అంచనాలేర్పడ్డాయి అంటే అది దేవీ క్రెడిట్ అనడంలో సందేహమేం లేదు.