• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లీడర్ 2లో మహేష్.. AVM...

లీడర్ 2లో మహేష్.. AVM వారు ఏమన్నారంటే?

By - Tupaki Desk
Update: 2022-08-14 07:40 GMT
శేఖర్ కమ్ముల రానా దగ్గుపాటి కలయికలో వచ్చిన లీడర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా లాభాలను అందించలేదు కానీ ఈ సినిమాను ఇప్పటికీ అభిమానించే వారు చాలామంది ఉన్నారు. టీవీలలో చాలాసార్లు మంచి రేటింగ్స్ కూడా అందుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ AVM ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుంటుంది అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు.

 శేఖర్ కమ్ముల కూడా చాలామంది ఫ్యాన్స్ నుంచి ఆ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. తప్పకుండా ఆ సినిమా కొనసాగింపుగా మరొక సినిమాను చేస్తాను అని కూడా శేఖర్ కమ్ముల గతంలో ఒక వివరణ అయితే ఇచ్చాడు.

కానీ మళ్ళీ ఎక్కడ ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించింది లేదు. అయితే గతంలో మహేష్ బాబుతో మాత్రం లీడర్ 2 సినిమా ఉంటుంది అని చాలా రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. ఆ విషయంపై కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించింది లేదు.

ఇక రీసెంట్గా AVM నిర్మాణ సంస్థ 4వ జనరేషన్ లో ఒకరు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లను అలాగే చిన్న తరహా చిత్రాలను నిర్మిస్తున్న AVM నిర్మాణ సంస్థ యాజమాన్యంలో ఒకరైన అరుణ గుహన్ లీడర్ టు పై వస్తున్న రూమర్లకు కథనాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదివరకే కొన్ని చర్చలు జరిగాయి అంటూ భవిష్యత్తులో ఆ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఆమె తెలియజేశారు.

కాబట్టి మహేష్ బాబు లీడర్ టు విషయంలో మాత్రం చర్చలు అయితే కొనసాగినట్లు మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. గతంలో శేఖర్ కమ్ముల మహేష్ బాబుకు ఫిదా కథ చెప్పిన విషయం తెలిసిందే.

కానీ స్టార్ హోదా కారణంగా కథ నచ్చినప్పటికీ మహేష్ చేయలేకపోయాడు. ఇక లీడర్ 2 లాంటి కథతో వస్తే మాత్రం తప్పకుండా మహేష్ ఒప్పుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక కుదిరితే శివాజీ 2 కూడా ఉంటుందని కానీ రజనీకాంత్, శంకర్ గారు ఇతర కమిట్మెంట్స్ బిజీగా ఉన్నట్లు కరుణ గుహన్ వివరణ ఇచ్చారు.
Tags:    
  • ShekarKammula 
  • RanaDaggubati 
  • AVMProductionHouse 
  • Maheshbabu 
  • Leader2Film 
  • Shivaji2 
  • Rajinikanth 
  • MaheshbabuinLeader2Film 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS