• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జ‌య‌హో బాలీవుడ్‌.. ఈ ఐదే...

జ‌య‌హో బాలీవుడ్‌.. ఈ ఐదే ర‌క్షించాలి

By - Tupaki Desk
Update: 2015-10-12 22:30 GMT
86 సినిమాలు 11 స‌క్సెస్‌ లు.. ఇదీ ఈ ఏడాది బాలీవుడ్ ట్రాక్ రికార్డ్. ఇది చాలా పూర్ రిజ‌ల్ట్‌. అయితే ప‌రాజ‌యాల భారం నుంచి సేద‌దీర్చ‌డానికి ఈ ద‌స‌రా నుంచి డిసెంబర్‌ లో వ‌చ్చే క్రిస్మ‌స్ మ‌ధ్య‌లో 5 క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌ కి వ‌స్తున్నాయి. ఆ ఐదింటి వివ‌రాల్ని సేక‌రిస్తే.. ఇలా ఉన్నాయి.

షాన్ దార్‌:

అక్టోబ‌ర్ 22న ఈ సినిమా రిలీజ‌వుతోంది. షాహిద్ క‌పూర్ - ఆలియా భ‌ట్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి క్వీన్ ఫేం వికాస్ బాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్‌ - అనురాగ్ క‌శ్య‌ప్ నిర్మాత‌లు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ బ్యాక్‌ డ్రాప్‌ లో సినిమా  ఇది. ఏదైనా బీచ్‌ కి వెళ్లి ఆ ప‌రిస‌రాల్లో సంథింగ్ వెరైటీగా భారీగా చేసుకునే పెళ్లిలో ఎలాంటి గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు చోటు చేసుకుంటాయో చూడాలంటే షాన్‌ దార్ చూడాల్సిందే. అందుకు 22 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.

త‌మాషా:

న‌వంబ‌ర్ 27న రిలీజ‌వుతోంది. ర‌ణ‌బీర్ క‌పూర్ - దీపిక ప‌దుకొన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి రాక్‌ స్టార్ ఫేం ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ మూడు విభిన్న‌మైన కోణాలు ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దీపిక‌తో ఎఫైర్ ముగిశాక ర‌ణ‌బీర్ న‌టిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. మాజీ ప్రేయ‌సితో ర‌ణ‌బీర్ రొమాన్స్  గురించి ఒక‌టే డిష్క‌స‌న్‌.

ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో:

న‌వంబ‌ర్ 22న రిలీజ‌వుతోంది. స‌ల్మాన్‌ ఖాన్ - సోన‌మ్ క‌పూర్ జంట‌గా తెర‌కెక్కిన ఓ డిఫ‌రెంట్  ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. సావారియా త‌ర్వాత ఈ ఇద్ద‌రూ ఒకే సినిమాలో ఒకే ఫ్రేములో క‌నిపించ‌బోతున్నార‌న్న ఆస‌క్తి యూత్‌ లో గిలిగింత‌లు పెడుతోంది. మైనే ప్యార్ కియా - హ‌మ్ ఆప్ కే కౌన్ హై వంటి క్లాసిక్స్ తెర‌కెక్కించిన సూర‌జ్ బ‌ర్జాత్యా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

దిల్‌వాలే :

డిసెంబ‌ర్ 18న రిలీజ‌వుతోంది. డీడీఎల్‌ జే పెయిర్  షారూక్‌ ఖాన్ - కాజోల్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌ లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షారూక్ సోద‌రుడి పాత్ర‌లో వ‌రుణ్‌ ధావ‌న్ న‌టిస్తున్నాడు. అత‌డి ల‌వ్ ఇంట్రెస్ట్‌ గా కృతిస‌నోన్ న‌టిస్తోంది.

భాజీరావ్ మ‌స్తానీ :
డిసెంబ‌ర్ 18న రిలీజ‌వుతోంది. ఓ ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. రామ్ లీల జోడీ మ‌రోసారి ఈ చిత్రంలో రిపీట‌వుతోంది. ర‌ణ‌వీర్‌ - దీపిక ప‌దుకొన్‌ - ప్రియాంక చోప్రా క్రేజీ కాంబినేష‌న్ తో వ‌స్తున్న చిత్ర‌మిది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌ తో సంజ‌య్ లీలా భ‌న్సాలీ  ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

Tags:    
  • Bollywood Movies 
  • Telugu NEws 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS