ఫొటోటాక్ : ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు సూపర్‌ స్టార్స్

Update: 2021-08-13 02:09 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మరియు క్రికెట్ లో ఆల్ టైమ్‌ సూపర్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోనీలు ఇటీవల చెన్నైలో కలిశారు. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరికి కామన్ అభిమానులు లక్షల్లో ఉంటారు. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ అయినందున ధోనీ పై తమిళ జనాలు విపరీతమైన అభిమానంను కనబర్చుతున్నారు. ఇక తమిళ సినీ వినీలాకాశంలో సూపర్‌ స్టార్‌ అయిన విజయ్‌ కూడా అశేష అభిమాన గనంను దక్కించుకున్నాడు. అలాంటి వీరిద్దరు కలయిక తమిళ నాట హాట్ టాపిక్ గా నిలిచింది.

ప్రస్తుతం బెస్ట్‌ సినిమా షూటింగ్‌ కోసం విజయ్‌ చెన్నైలోని ఒక స్టూడియోలో ఉన్నారు. బెస్ట్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ధోనీ అక్కడ కు వెళ్లారు. త్వరలోనే ఐపీఎల్‌ మ్యాచ్‌ ల కోసం ఆటగాళ్లు యూఏఈకి వెళ్లబోతున్నారు. కనుక చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు ఫొటో షూట్ మరియు చిన్న యాడ్‌ మేకింగ్‌ ఉండబోతుందట. ఆ యాడ్ షూట్‌ లో ధోనీతో పాటు పలువురు టీమ్‌ మెంబర్స్‌ పాల్గొంటున్నారు. బెస్ట్‌ షూటింగ్ జరుగుతున్న చోటే ఆ యాడ్‌ షూట్‌ కూడా పెట్టడంతో విజయ్‌ ను ధోనీ కలిశాడని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇద్దరు కొద్ది సమయం చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసిన సమయంలో అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమ్మ గూడటంతో పాటు ఇద్దరు సూపర్ స్టార్‌ లను ఒకే ఫ్రేమ్‌ లో చూసుకునేందుకు కెమెరాలకు మొబైల్స్ కు చాలా మంది పని చెప్పారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నటిస్తున్న బెస్ట్‌ తర్వాత తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను చేయాల్సి ఉంది. దిల్‌ రాజు బ్యానర్ లో రూపొందబోతున్న ఆ సినిమాను ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించి వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు లో విజయ్‌ మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.


Tags:    

Similar News