కాపీ కొట్టినా స్ఫూర్తి నింపిన టీవీ ఆర్టిస్టులు

Update: 2020-04-17 04:30 GMT
క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో అవేర్ నేస్ లో భాగంగా బాలీవుడ్- టాలీవుడ్ స‌హా అన్ని భాష‌ల న‌టులు క‌లిసి `ఫ్యామిలీ` అనే  షార్ట్ ఫిల్మ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ పెద్ద‌న్న పాత్ర పోషిస్తే.. ర‌జ‌నీకాంత్- చిరంజీవి- మోహ‌న్ లాల్ - మ‌మ్ముట్టి- ర‌ణ‌బీర్ క‌పూర్- ఆలియా భ‌ట్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు మిగ‌తా పాత్ర‌లు పోషించారు.   స్క్రీన్ ప్లే బేస్డ్ క‌రోనా అవేర్ నెస్ ల‌ఘు చిత్ర‌మిది. అన్ని భాష‌ల న‌టులు ఎవ‌రి సొంత భాష‌లో వాళ్లు డైలాగులు చెబితే.. వాట‌న్నిటినీ ఒకే ప్రేమ్ లోకి మెర్జ్ చేసారు ఆస‌క్తిక‌రంగా. ఉత్త‌రాది న‌టులు..ద‌క్షిణాది న‌టులు తెర‌పై క‌నిపిచ‌డంతో ఆ ల‌ఘు చిత్రానికి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స్టే హోమ్...స్టే సేఫ్! అన్న నినాదంతో ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్ ముగించిన తీరు ర‌క్తి క‌ట్టించింది.

అయితే ఈ వీడియోకి అనుక‌ర‌ణ‌లు వెబ్ లో పోటెత్తుతున్నాయి. తాజాగా టీవీ ఆర్టిస్టులు అంతా క‌లిసి  ఇలాంటి ఓ అవేర్ నేస్ షార్ట్ ఫిల్మ్ చేసారు.  ఇందులో ఏపీ- తెలంగాణ స‌హా క‌ర్ణాట‌క‌- కేర‌ళ‌- త‌మిళ‌నాడు ‌కు చెందిన టీవీ నటులంతా క‌లిసి న‌టించారు. లాక్ డౌన్ వేళ  ఓ పెద్ద ఫ్యామిలీ  ఒకే ఇంట్లో క‌లిసి ఉంటే ఎలా ఉంటుంది?  ఇండ్ల‌లో ఉంటే ఎవ‌రి అభిప్ర‌యాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ఇందులో చూపించారు. న‌టుడు రవి ఇంటి నుంచి బయటకు వెళ్లాలనుకుంటాడు. కానీ ఇతర న‌టులంతా అయ్యా అలా చేయవద్దని వారిస్తుంటారు. లాక్ డౌన్ వేళ ఇంట్లో ఉండాల్సిన అవ‌స‌రం గురించి  చ‌క్క‌ని సందేశం ఇస్తారంతా.

షార్ట్ ఫిల్మ్ లో అన్ని షాట్లు  ప్రతి నటుడు.. వారి ఇళ్ళ వద్దనే విడి  విడి గా చిత్రీకరించారు. ఇందులో ఎస్పీ బాలసుబ్ర‌మ‌‌ణ్యం - హరిత- యమున- అస్మితా- సాయి కిరణ్- యాంకర్ రవి- నటుడు రవి- బాలాదిత్య - అలీ రెజా త‌దిత‌రులు న‌టించారు.  ఈ ల‌ఘు చిత్రం కూడా ఫ్యామిలీ త‌ర‌హా స్క్రీన్ ప్లేని అనుస‌రించారు. ఇది బ్లాక్ అండ్ వైట్ షార్ట్ ఫిల్మ్. ప్ర‌య‌త్నం ఏదైనా మంచి కోస‌మే. మ‌రి ఈ ల‌ఘు చిత్రం ఎంత మందిలో మార్పు తీసుకొస్తుందో చూడాలి.
Tags:    

Similar News