ఆ యాంకర్ సినిమాని కూడా కొంచెం పట్టించుకోండయ్యా...!
తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇప్పటి వరకు ప్రదీప్ చేసిన షోస్ అన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. ఈ షోలన్నీ ఆయనకు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఈ ఇమేజ్ తో చాలా రోజుల నుంచి ప్రదీప్ వెండి తెరపై హీరోగా కనిపించాలని ప్రయత్నాలు అయితే చేసాడు కానీ సరైన కథ దొరకలేదు. రొటీన్ కథలతో కాకుండా కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురు చూసాడు ప్రదీప్. ఎట్టకేలకు మున్నా అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే సినిమా తెరకెక్కించారు. సుకుమార్ దగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసాడు మున్నా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ఫిబ్రవరి లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా కనిపించాలనే కోరిక మరికొన్ని రోజులు వాయిదా పడింది.
లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సినీ అభిమానులు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తూ, సాంగ్స్ వింటూ, సినిమా న్యూస్ తెలుసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే అన్ని సినిమాల్ని ఎదో రకంగా ఆడియెన్స్ గుర్తు చేసుకుంటున్నారు కానీ '30 రోజుల్లో ప్రేమకథ'ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కంప్లీట్ అయిన ఈ సినిమాకి సంబంధించి ఒక్క న్యూస్ కూడా బయటకి రావడంలేదు. యాంకర్ టర్నడ్ హీరో ప్రదీప్ సినిమాను మాత్రం అటు ఇండస్ట్రీ వారితో పాటు ఇటు కామన్ ఆడియెన్స్ కూడా పక్కన పెట్టేసినట్లుగా అనిపిస్తోంది. ఈ యాంకర్ కి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రెండు పెద్ద బ్యానర్లు గీతా ఆర్ట్స2, వీ సెల్యులాయిడ్స్ వారు ఈ సినిమాను డిస్ట్రీబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ కి బ్రేక్ పడింది. ఆ మధ్య వదిలన సిద్ శ్రీరామ్ పాడిన ఈ సినిమాలోని పాటకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటకి 100 మిలియన్ల వ్యూస్ కూడా వచ్చాయి.
ఆల్రేడీ ఉన్న గ్రిప్పింగ్ పబ్లిసిటీ కంటెంట్ ని పాట రూపంలో ఈ టీమ్ రిలీజ్ చేసేసింది. ఇప్పుడు ఇంతకు మించి ఏదైనా కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ లాక్ డౌన్ తరువాత ఈ సినిమా వైపు చూస్తారని సినీ వర్గాల అభిప్రాయం. ఇప్పుడు లాక్ డౌన్ తరువాత ఈ సినిమాకి ఈజీగా వచ్చిన క్రేజీని మళ్లీ తిరిగి తీసుకురావడం చాలా కష్టమనే చెప్పాలి. ప్రదీప్ మాచిరాజుకి ఉన్న టీవీ ఫ్యాన్ బేస్ థియేటర్లకు వచ్చి సినిమాను చూస్తారనే గ్యారంటీ లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలానే క్రేజ్ ఏ మాత్రం లేకుంటే ఈ సినిమాను తీసుకున్న గీతా ఆర్ట్స2, వీ సెల్యులాయిడ్స్ వారు ఈ సినిమాను పక్కన పెట్టేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఈ డామేజ్ కవరింగ్ కి యాంకర్ ప్రదీప్ ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడో చూడాలి.