'ధ‌ర్మ‌న్ ని' న‌ర‌సింహ 2 అనొచ్చా?

సూపర్ స్టార్ రజినీకాంత్- ఉలగనాయగన్ కమల్ హాసన్ ల మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది.

Update: 2026-06-25 06:35 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్- ఉలగనాయగన్ కమల్ హాసన్ ల మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఒకేసారి పరిశ్రమలోకి అడుగుపెట్టి బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా నిలిచినా? వ్యక్తిగత జీవితంలో వారిద్దరూ దశాబ్దాలుగా ప్రాణస్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో కమల్ హాసన్ పంచుకున్న ఆసక్తికరమైన జ్ఞాపకం ఇటు సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ సరికొత్త ఆసక్తిని రేకెత్తించింది. దాదాపు నలభై ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రయాణంలో రజినీకాంత్ చిత్రానికి సంబంధించిన కీలకమైన ఆలోచన ఎలా పుట్టిందో వివరించారు.

కమల్ హాసన్ వెల్లడించిన వివరాల ప్రకారం నలభై ఏళ్ల క్రితం ఒకానొక సందర్భంలో ఆయన, రజినీకాంత్ కలిసి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు మిత్రుల మధ్య సాగిన సాధారణ సంభాషణ అద్భుతమైన కథాంశానికి పునాది వేసింది. అలా ఆ ప్రయాణంలోనే `ధర్మన్` అనే ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాథమిక ఆలోచన రూపుదిద్దుకుంది. ఇద్దరు లెజెండ్రీ నటుల మేధోమథనం నుండి పుట్టిన ఇలాంటి ఐడియాలు కేవలం కాలక్షేప చర్చలు కాకుండా.. వెండితెరపై సంచలనాలు సృష్టించే సత్తా ఉన్నవని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొన్న దర్శకుడు ఒకరు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ అప్పట్లో ప్రతిపాదించిన ఆ కథాంశం -రజినీకాంత్ పాత్ర చిత్రణ రజినీ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన `పడయప్ప` (తెలుగులో నరసింహ) చిత్రంతో పోల్చదగినదని పేర్కొన్నారు. `పడయప్ప`లో రజినీకాంత్ మాస్ ఇమేజ్, ఆయన నటనలోని తీవ్రత ఏ స్థాయిలో ఉంటాయో? ఈ నలభై ఏళ్ల నాటి `ధర్మన్` ఐడియాలో కూడా అదే తరహా పవర్-ప్యాక్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయని దర్శకుడు పోల్చి చెప్పడం విశేషం.

సాధారణంగా ఇద్దరు అగ్ర నటులు ఒకే పరిశ్రమలో ఉన్నప్పుడు వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. కానీ కమల్, రజినీలు ఆ పోటీని పక్కనబెట్టి ఒకరి సినిమాలకు మరొకరు ఐడియాలు ఇచ్చుకోవడం, కథల చర్చల్లో పాల్గొనడం వంటివి చేసేవారనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. రజినీకాంత్ మాస్ ఎనర్జీని కమల్ హాసన్ ఎంతగా ఆస్వాదించేవారో? అలాగే కమల్ లోని వైవిధ్యాన్ని రజినీ ఎంతగా గౌరవించేవారో ?ఈ నలభై ఏళ్ల నాటి విమాన ప్రయాణ ముచ్చట్లు మనకు స్పష్టం చేస్తున్నాయి.

నలభై ఏళ్ల క్రితం అంటే 1980ల నాటి చిత్ర నిర్మాణ వాతావరణం ఇప్పటికంటే చాలా భిన్నంగా ఉండేది. అప్పట్లో నేటిలాంటి కార్పొరేట్ పద్ధతులు, సుదీర్ఘమైన బౌండ్ స్క్రిప్ట్ సంస్కృతి కంటే నటీనటులు, దర్శకుల మధ్య ఉండే వ్యక్తిగత సంబంధాలు, ఆకస్మిక సృజనాత్మక ఆలోచనల ఆధారంగానే గొప్ప కథలు పుట్టుకొచ్చేవి. ఒక విమాన ప్రయాణంలో పుట్టిన చిన్న ఆలోచనను ఒక మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మార్చగలిగే ప్రతిభ నాటి సినిమా మేధావులకు ఉండేదనడానికి `ధర్మన్` వృత్తాంతమే ఒక ఉదాహరణ.

ఇలాంటి ఐకానిక్ జ్ఞాపకాలు - చారిత్రక విశేషాలు వెలుగులోకి రావడం వల్ల పాత తరం సినిమా మేకింగ్ పట్ల నేటి తరానికి స్పష్టమైన అవగాహన వస్తుంది. కమల్ హాసన్, రజినీకాంత్ ల కలయికలో ఆ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో రాకపోయినా? వారి ఆలోచనల వెనుక ఉన్న ఆనాటి సినిమాటిక్ ప్యాషన్ ఎప్పటికీ అమూల్యమైనది. పరిశ్రమలో ఎన్ని సాంకేతిక మార్పులు వచ్చినప్పటికీ ఇద్దరు లెజెండ్స్ మధ్య ఉన్న ఈ అద్భుతమైన సృజనాత్మక బంధం రాబోయే తరాల నటీనటులకు, దర్శకులకు ఎల్లప్పుడూ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది.

Tags:    

Similar News