• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌.. సలార్ లను...

కేజీఎఫ్‌.. సలార్ లను పోల్చుతూ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2021-08-24 10:46 GMT
కేజీఎఫ్‌ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌ 2 విడుదల కాకుండానే సలార్ సినిమాను చకచక ముగించే పనిలో ఉన్నాడు. ప్రభాస్‌ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ మెజార్టీ పార్ట్‌ షూటింగ్‌ ను ముగించారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి జగపతి బాబు లుక్ ను కూడా ప్రశాంత్ నీల్‌ రివీల్‌ చేయడం జరిగింది. జగపతిబాబును సలార్‌ లో రాజమన్నార్‌ సినిమాలో చూపించబోతున్నట్లుగా అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసి మరీ ప్రకటించాడు. ఈ పాత్రను కేజీఎఫ్‌ సినిమాలోని పాత్రతో పోల్చుతూ ప్రశాంత్ నీల్‌ ను కొందరు నెటిజన్స్ ట్రోల్‌ చేస్తున్నారు.

కేజీఎఫ్ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ తో చేయబోతున్న సలార్ సినిమా కూడా కేజీఎఫ్‌ మాదిరిగానే ఉంటుంది అంటే మాత్రం తిరష్కరణ తప్పదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ స్పీడ్ గా సినిమాలు చేసే ఉద్దేశ్యంతో కథల విషయంలో కొత్తదనం కోల్పోతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ప్రభాస్‌ లుక్ తో పాటు తాజాగా విడుదల అయిన జగపతిబాబు లుక్‌ ను చూస్తుంటే సలార్‌ మరో కేజీఎఫ్‌ మాదిరిగా ఉంటుందేమో అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి సినిమా దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకులు ఆధరిస్తారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఖచ్చితంగా అభిమానులు లేదా సినీ విమర్శకులు దర్శకుడి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఖాయం. సలార్ కనుక కొత్తగా కేజీఎఫ్‌ ను మరపించే విధంగా లేకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు ముందు ప్రశాంత్‌ నీల్‌ మళ్లీ కన్నడ సినిమాలు చేసుకుంటూ ఉండాల్సి వస్తుందని కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కాని ప్రశాంత్‌ నీల్‌ అభిమానులు మాత్రం కేజీఎఫ్‌ కు సలార్ కు పోస్టర్ల విషయంలో పాత్రల విషయంలో కాస్త పోలిక ఉంటుందేమో కాని సినిమాలు రెండు పూర్తి విభిన్నంగా ఉంటాయనే నమ్ముతున్నాం అంటున్నారు. సలార్‌ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prashant Neel 
  • KGF 
  • KGF2 
  • Yash 
  • Prabhas Prashant Neel Movie Updates 
  • Radhe Shyam 
  • Prashant Neel Movie Update 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS