తారక్ కోసం బన్నీ వెంకీ వెయిటింగ్!!

Update: 2018-09-28 11:52 GMT
త్రివిక్రమ్ ఎంత పెద్ద దర్శకుడైనా కావొచ్చు. ఆ పేరుకి మార్కెట్ లో ఎంత బ్రాండ్ వేల్యూ అయినా ఉండొచ్చు. కానీ జనవరిలో వచ్చిన అజ్ఞాతవాసి ఫలితం చూపించిన ప్రభావం చిన్నది కాదు. నిజానికి కొందరు దర్శకులు ఒక స్థాయికి చేరుకున్నాక ఒకటి రెండు ఫ్లాపులు వాళ్ళ ఇమేజ్ మీద ఏమంత ఎఫెక్ట్ చూపించవు. కానీ అజ్ఞాతవాసి కేసు వేరు. త్రివిక్రమ్ ఇలాంటి సినిమా కూడా తీయగలడా అని అనుమానపడేంత విమర్శలు మూటగట్టుకున్నాడన్నది నిజం. అందుకే అరవింద సమేత వీర రాఘవతో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అది ట్రైలర్ లో కనిపిస్తోంది కూడా. ఎన్నడూ లేనిదీ సీమ హింసను ఓ రేంజ్ లో చూపించినట్టు లీక్ అయిన యాక్షన్ ఎపిసోడ్ లో కూడా అభిమానులు గమనించారు.

సో ఇది గట్టిగా కొడితే త్రివిక్రమ్ కు ముందు సినిమా చేదు జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోతాయి. కానీ ఇప్పుడు ఈ విషయంలో త్రివిక్రమ్ ఫ్యాన్స్ తో పాటు వెంకటేష్ అల్లు అర్జున్ కూడా ఆసక్తిగా ఉన్నారట. అదేంటి అనుకోకండి. ఇక్కడే ఉంది చిన్న మతలబు. త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ తర్వాత వేరే ప్రాజెక్ట్స్ కూడా కమిటయ్యాడు కానీ ముందు వరసలో ఉన్నది మాత్రం వెంకటేష్ మాత్రమే. వెంకీతో సినిమా ఉండబోతోందని గతంలోనే యాడ్ రూపంలో ప్రకటన కూడా ఇచ్చారు. సో అది బాలన్స్ ఉంది. మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. విక్రమ్ కుమార్ ది హోల్డ్ లో పెట్టి త్రివిక్రమ్ తో చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని. ఇది ఒకే అయితే హ్యాట్రిక్ మూవీకి దారి పరిచినట్టే. కానీ త్రివిక్రమ్ దగ్గర ఉన్నది మల్టీ స్టారర్ అని టాక్.

అది వెంకీ బన్నీలకు బాగా సెట్ అయ్యేలా ఉండటంతో ఒక దెబ్బకు రెండు ప్రోజెక్టుల తరహాలో ఇద్దరి మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని త్రివిక్రమ్ ప్లానట. సరే కథ విషయం పక్కన పెడితే అరవింద సమేత వీర రాఘవ ఫలితం చూసాక నిర్ణయం తీసుకోవచ్చు లెమ్మని  వెంకీ బన్నీ వెయిట్ చేస్తున్నట్టు వినికిడి. ఎలాగూ త్రివిక్రమ్ అది విడుదల అయ్యాక కూడా ఓ రెండు మూడు వారాలు బిజీగా ఉంటాడు కాబట్టి ఆ లోపు తేల్చుకోవచ్చని ఇద్దరూ అనుకున్నారట. మొత్తానికి సినిమా స్టోరీ లాగే ఉన్న ఈ ఆసక్తికరమైన ట్విస్ట్ ఇంకే మలుపు తిరుగుతుందో లెట్ వెయిట్ అండ్ సి.
Tags:    

Similar News