మారుతోన్న స్టార్ హీరోయిన్ల ఆలోచనలు!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లే ఐటం భామలుగా మేకప్ వేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటం భామలుగా ఛాన్సులు వచ్చినా? కాదనకుండా పని చేస్తున్నారు.;
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లే ఐటం భామలుగా మేకప్ వేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే ఐటం భామలుగా ఛాన్సులు వచ్చినా? కాదనకుండా పని చేస్తున్నారు. ఒక్క పాటతోనే కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. ఇదేదో బాగుందని వాళ్లను చూసి మరింత మంది భామలు ముందుకొచ్చారు.
సమంత, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, శ్రీలీల, పూజాహెగ్డే లాంటి భామలు అలా పని చేసిన వారే. మరి ఇప్పుడీ తరహా ఆలోచనా విధానం మారుతోందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే..
సమంత, శ్రీలీల, పూజా హెగ్డే వంటి అగ్ర నటీమణులు స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించు కున్నట్లు సమాచారం. గతంలో సమంత `పుష్ప` సినిమాలో `ఊ అంటావా` పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ ఆ తర్వాత ఆమెకు వచ్చిన అనేక భారీ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేయాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది.
యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఇదే బాటలో పయనిస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే భారీ అవకాశాలు అందుకుం టున్న ఈ భామ కేవలం డ్యాన్సులకే పరిమితం కాకుండా తనలోని నటిని నిరూపించుకోవాలని చూస్తోంది.
స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తే భవిష్యత్తులో కేవలం అటువంటి పాత్రలకే తనను పరిమితం చేస్తారనే భయం అమ్మడు ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే, పాన్-ఇండియా ప్రాజెక్టుల్లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా ఛాన్సులు రావాలంటే ఐటమ్ సాంగ్స్ ట్యాగ్ పడకుండా చూసుకోవాలని ఆమె భావిస్తోందిట. బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తోన్న అమ్మడు ప్రస్తుతం కెరీర్ గ్రాఫ్‌ను అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేసినా? ఇప్పుడు మాత్రం కేవలం పవర్‌ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ పాత్రలు లేదా స్టార్ హీరోల సరసన మెయిన్ హీరోయిన్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోందిట.
ఐటమ్ సాంగ్స్ చేయడం వల్ల హీరోయిన్ ఇమేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తోందిట. మరి ఈ మార్పుకు ప్రత్యేక కారణం ఏంటి? అంటే పాన్-ఇండియా మార్కెట్ గా వినిపిస్తోంది. దక్షిణాది చిత్రాలు కేవలం రీజనల్ మార్కెట్ కే పరిమితం కాలేదు. బాలీవుడ్ , అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్నాయి. అటువంటి క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా ఛాన్స్ రావాలంటే? ఆ నటి ఇమేజ్ చాలా పటిష్టంగా ఉండాలి. స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల ఆ నటి కేవలం గ్లామర్ డాల్‌గా మాత్రమే ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే లాంగ్ రన్ లో కెరీర్ నిలబడాలంటే ఐటమ్ సాంగ్స్ కు నో చెప్పడమే మంచిదని భావిస్తున్నారుట.