పవన్‌ స్క్రిప్ట్‌ తో వెంకీ మూవీ..!

Update: 2018-09-14 07:00 GMT
విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ తో కలిసి ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు ఆ చిత్రాన్ని భారీ అంచనాల నడుమ నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ‘ఎఫ్‌ 2’ రాబోతుంది. ఆ వెంటనే నాగ చైతన్యతో కలిసి వెంకటేష్‌ మరో మల్టీస్టారర్‌ కు సిద్దం అవుతున్నాడు. ‘జైలవకుశ’ చిత్ర దర్శకుడు బాబీ ఈ మల్టీస్టారర్‌ కు స్క్రిప్ట్‌ ను సిద్దం చేస్తున్నాడు. ఆ చిత్రంకు ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసమయంలోనే వెంకటేష్‌ త్వరలోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే వెంకటేష్‌ ను కలిసిన దర్శకుడు త్రివిక్రమ్‌ తన వద్ద ఉన్న స్టోరీ లైన్‌ ను వినిపించినట్లుగా తెలుస్తోంది. గతంలో పవన్‌ కళ్యాణ్‌ కోసం రెడీ చేసుకున్న ఆ కథను వెంకీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్‌ సిద్దం అయ్యాడు. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్‌ - త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో ఒక చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ఆ చిత్రం కోసం త్రివిక్రమ్‌ గతంలోనే ఒక స్టోరీ లైన్‌ ను తయారు చేయడం - అది పవన్‌ కు నచ్చడం జరిగిందట. కాని పవన్‌ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదని - ఇప్పుడు అదే కథతో వెంకీని త్రివిక్రమ్‌ ఒప్పించాడు అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

గతంలో వెంకటేష్‌ తో ‘నువ్వునాకు నచ్చావ్‌’ - ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు రచయితగా వర్క్‌ చేసిన మాటల మాంత్రికుడు చాలా రోజులుగా త్రివిక్రమ్‌ తో ఒక చిత్రంను చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అది వచ్చే ఏడాదికి కార్యరూపం దాల్చబోతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో రూపొందిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంను విడుదలకు త్రివిక్రమ్‌ సిద్దం చేస్తున్నాడు. అరవింద సమేత చిత్రం విడుదలైన తర్వాత వెంకీ కోసం స్క్రిప్ట్‌ ను సిద్దం చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
Tags:    

Similar News