ఎన్టీఆర్30 : ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న రూమర్స్
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హారిక అండ్ హాసిని బ్యానర్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ అవ్వడమే ఆలస్యం ఈ సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ త్రివిక్రమ్ అండ్ టీం ప్రకటించారు.
ఎన్నో సినిమాల ప్లానింగ్స్ ను.. విడుదల తేదీలను తారు మారు చేసిన కరోనా ఎన్టీఆర్ 30 పై కూడా పడ్డట్లుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్ ఆలస్యం అయ్యేలా ఉందని.. దాంతో ఈ ఏడాది చివరి వరకు త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని.. అందుకే త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మరో హీరోతో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఆలస్యం అయినన్ని రోజులు తాను వెయిట్ చేయడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదని.. వెంటనే మరో సినిమాను మొదలు పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తే తప్పకుండా హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్న నందమూరి ఫ్యాన్స్ కు ఈ పుకార్లు మింగుడు పడటం లేదు.
ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండే కొందరు మాత్రం త్రివిక్రమ్ ఖచ్చితంగా తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తోనే చేస్తాడు.. ఎన్టీఆర్ 30 సినిమాకు ఖచ్చితంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడు. పుకార్లను నమ్మవద్దంటూ చెబుతున్నారు. అసలు విషయం ఏంటీ అనేది కొన్ని రోజులు ఆగితే కాని తెలియదు.