రిలీజ్ కు ముందే లాభాల్లో శ్రీ విష్ణు సినిమా

టాలీవుడ్‌లో ఎంట‌ర్టైన్మెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.;

Update: 2026-02-20 08:23 GMT

టాలీవుడ్‌లో ఎంట‌ర్టైన్మెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. వరుస స‌క్సెస్‌ల‌తో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు తాజా సినిమా విష్ణు విన్యాసం ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి ఆల్రెడీ రిలీజైన టీజర్, సాంగ్స్ విష్ణు విన్యాసం మూవీపై భారీ అంచనాలను పెంచాయి.

యదునాథ్ మరుతి రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సుమంత్ నాయుడు.జి నిర్మించారు. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందింద‌ని టీజర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. శ్రీ విష్ణు తనదైన టైమింగ్, కామెడీ శైలి, ఎమోషనల్ టచ్‌తో మరోసారి ఆడియ‌న్స్ ను అలరించనున్నారనే నమ్మకం ఫ్యాన్స్ లో బాగా కనిపిస్తోంది.

విష్ణు విన్యాసంకు రూ.26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

రీసెంట్ గా రిలీజైన టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ సర్కిల్స్‌ను ఆశ్చర్య‌ప‌రుస్తుంది. శ్రీ విష్ణు లాస్ట్ మూవీ సింగిల్ బ్లాక్‌బస్టర్ స‌క్సెస్ త‌ర్వాత అత‌ని మార్కెట్ బాగా పెరిగింది. అదే నమ్మకంతో విష్ణు విన్యాసం సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం రూ.26 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.

సినిమాకు రూ.19 కోట్ల బ‌డ్జెట్

సినిమా మొత్తానికి రూ.19 కోట్ల బడ్జెట్ ఖ‌ర్చ‌వ‌గా, రిలీజ్ కు ముందే ఈ మూవీకి రూ.7 కోట్ల లాభం వచ్చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రిలీజ్ కు ముందే నిర్మాత‌ల‌కు ఇంత లాభం రావ‌డ‌మంటే నిజంగా అది జాక్‌పాట్ అనే చెప్పాలి. ఆల్రెడీ నిర్మాత లాభాల్లో ఉండ‌గా, రిలీజ్ తర్వాత వచ్చే థియేట్రికల్ కలెక్షన్లు అదనపు లాభంగా మారనున్నాయి.

మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా

విష్ణు విన్యాసం టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ , శ్రీ విష్ణు ఇప్పుడున్న ఫామ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్ ఇవ‌న్నీ సినిమాకు మంచి ఓపెనింగ్స్ సాధించే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో శ్రీ విష్ణుకు ఉన్న పాపులారిటీ ఈ సినిమాకు బలంగా మారే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. న‌య‌న్ సారిక హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీ కూడా హిట్ అయితే శ్రీవిష్ణు బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

Tags:    

Similar News