మహేష్ తో త్రివిక్రమ్ మూవీ.. మొదలయ్యేది అప్పుడే..నా??
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా హిట్ కాలేకపోయాయి. కానీ ప్రేక్షకులకు మాత్రం ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ లిస్టులో స్థానం పొందాయి. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్.. అరవిందసమేత - అలవైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్ లో ఉండగా.. అటు మహేష్ బాబు వరుసగా విజయాలతో మరో బ్లాక్ బస్టర్ కోసం సిద్ధంగా ఉన్నాడు.
ఇద్దరూ సూపర్ ఫామ్ లో ఉండేసరికి ఈ కాంబినేషన్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే త్రివిక్రమ్ - మహేష్ కాంబో వెండితెర పై సూపర్ హిట్ కాకపోయినా టీవీ ప్రేక్షకులకు పై మాత్రం మంచి ఫీస్ట్ మూవీస్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే తాజాగా వీరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రకటించే సరికి ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. వీరి నుండి చివరిగా ఖలేజా సినిమా వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది. అందుకే ఇప్పుడు మూడో సినిమా అనేసరికి ఫ్యాన్స్ లో ఉత్సాహం మాములుగా లేదు. ప్రస్తుతం వీరి సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా వీరి సినిమా పై సోషల్ మీడియాలో సినీ వర్గాలలో క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. విషయం ఏంటంటే.. మహేష్ - త్రివిక్రమ్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు సినిమా ప్రారంభం కానుందని అనుకున్నారు. కానీ ఆరోజు నిరాశే మిగిలింది. ఇప్పుడు మరోసారి వార్తలు వచ్చేసరికి క్లారిటీ కావాలని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వీరి సినిమా మహేష్ పుట్టినరోజున లాంచనంగా ప్రారంభం కానుందని టాక్. మరి చూడాలి ఈసారి అయినా అధికారికంగా ప్రకటిస్తారేమో. ప్రస్తుతం మహేష్ 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు.