• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల బ్రహ్మీ పై గౌరవం...

అల బ్రహ్మీ పై గౌరవం చూపించాడా?

By - Tupaki Desk
Update: 2020-01-13 06:48 GMT
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈమద్య కాలంలో అసలు కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాలు అంటే ఖచ్చితంగా ఆయన ఉండేవాడు. ఆయన డేట్లు సర్దుబాటు కాకుంటే కొన్ని సార్లు స్టార్‌ హీరోల సినిమాలు ఆగిన సందర్బాలు కూడా ఉన్నాయి. బ్రహ్మానందం లేకుండా సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం వెనుకంజ వేసేవారు. అలాంటి క్రేజ్‌ ను దక్కించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు సినిమాల్లో కనిపించడమే కష్టం అయ్యింది. ఆయన రొటీన్‌ పాత్రలను ప్రేక్షకులు మెప్పించలేక పోయాయి. దాంతో ఆయన్ను దర్శకులు సినిమాలకు దూరం పెడుతున్నారు.

ఆయనపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల వారిలో అపారమైన గౌరవం అయితే ఉంది. కాని ఆయనకు అవకాశాలు మాత్రం ఇచ్చేందుకు ఎవరు సాహసించడం లేదు. బ్రహ్మానందం ఉంటే ఒకప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేవారు. కాని ఇప్పుడు బ్రహ్మానందం ఉంటే సినిమా ఆడుతుందా లేదా అనే అనుమానాలు ఉంటున్నాయి. ఆయన కామెడీ ఎబ్బెట్టుగా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయన అంటే అమితమైన అభిమానం ఉన్న వారు కూడా ఆయనతో వర్క్‌ చేయలని పరిస్థితి.

అయితే కొందరు దర్శకులు మాత్రం ఆయనపై గౌరవంతో గెస్ట్‌ అప్పియరెన్స్‌ గా తమ సినిమాల్లో ఆయన్ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా త్రివిక్రమ్‌ కూడా తన అల వైకుంఠపురంలో సినిమా లో బ్రహ్మానందంను చూపించాడు. రాములో రాముల పాటలో కొద్ది సెకన్లు మాత్రమే బ్రహ్మానందం కనిపించాడు. బ్రహ్మానందం ఆ మద్య అనారోగ్యం కారణంగా ఆపరేషన్‌ చేయించుకున్న విషయం తెల్సిందే. ఆ కారణంగా ఆయన మొహంలో కూడా కాస్త తగ్గినట్లుగా అనిపించింది. బ్రహ్మానందం మళ్లీ ఫామ్‌ లోకి వస్తాడని ఆశిస్తున్న వారికి వైకుంఠపురంలో ఆయన్ను చూస్తే నిరాశ కలుగక మానదు. బ్రహ్మానందం ఒక చరిత్రగానే మిగిలి పోతాడని.. మళ్లీ ఆయన టాలీవుడ్‌ లో ఎంటర్‌ టైన్‌ చేయడం కష్టమే అని సినీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    
  • Brahmanandam 
  • Allu Arjun 
  • Stylish Star 
  • Trivikram Srinivas 
  • Sankranthi 
  • Ala Vaikuntpuram Lo 
  • Ala Vaikuntapuramuloo Pre Release Event 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ ధూమ్ డైరెక్ట‌ర్ తెర‌పైకి!

2026-11-15 22:30 GMT

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

Copyright @2026

Powered by Blink CMS