ఇంత సడన్ గా ఎన్టీఆర్ అనిల్ తో మూవీ ఎందుకు చేెస్తున్నట్టు?
| 'దేవర'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్'తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్'కు సిద్ధమవుతున్నాడు. ఈ గ్యాప్‌లో అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఇటీవల తారక్‌కు అనిల్ కథ వినిపించగా నచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చే పనిలో రచనా బృందం ఉన్నట్లు టాక్.
జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి కేవలం యాక్షన్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యలో ఒక లైట్ వెయిట్ కథతో సినిమా చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని అనుకుంటున్నాడు. గతంలో ఆయన చేసిన 'అదుర్స్' మూవీ గురించి చాలా మంది మాట్లాడుతూ పలు ఈవెంట్స్ లో 'అదుర్స్ 2' ఎప్పుడు ఉంటుందని అభిమానులు అడుగుతున్నారు. దాంతో ఎన్టీఆర్ కి అదుర్స్ లాంటి కథతో సినిమా చేయాలనే కోరిక ఉన్నప్పటికి చారి క్యారెక్టర్ ను మించిన ఎంటర్ టైన్ మెంట్ ను అందించే పాత్ర దొరకాలని చూస్తున్నాడు. ప్రస్తుతం 'అదుర్స్ 2' చేయవచ్చు కానీ వినాయక్ పెద్దగా ఫామ్ లో లేడు. మళ్ళీ సీక్వెల్ అంటే దాని మీద చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఏ మాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. మొదటి పార్ట్ ఇమేజ్ కూడా పోతుంది.
కాబట్టి అదుర్స్ ను మించిన కామెడీ మూవీ చేసి తన అభిమానులను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి అయితేనే దానికి న్యాయం చేయగలడని అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో పాటుగా కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెసులు దక్కడం లేదు. కాబట్టి ఆ బ్యానర్ ను నిలబెట్టాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పైన ఉంది. అందుకే ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద చేస్తే ఆ బ్యానర్ మరోసారి లైమ్ లైట్ లోకి వస్తుందనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశాడు...