• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్...

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

| చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ నుంచి త్వరలో కొత్త గ్లిమ్స్‌తో పాటు రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇచ్చేందుకు యూవీ క్రియేషన్స్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డబ్బింగ్, ట్రైలర్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత కోసమే సినిమా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ‘కాకా’ తర్వాత ఈ సినిమా విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

By - Srikanth Kontham
Update: 2026-11-15 19:27 GMT

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలం త‌ర్వాత చిరంజీవి ఈ జాన‌ర్లో సినిమా చేయ‌డంతో? అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్నా? హైప్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే రిలీజ్ నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే ఓ భారీ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సరికొత్త పవర్‌ఫుల్ వీడియో గ్లిమ్స్‌తో పాటు విడుదల తేదీపై క్లారిటీని ఇచ్చేందుకు యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోందిట‌. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా వశిష్ఠ ట్రైలర్ కట్ .. గ్లిమ్స్ పనులను కూడా ఓ కొలిక్కి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు సమయం తీసుకున్న మేకర్స్ ఇప్పుడు పూర్తి స్థాయి అవుట్‌పుట్‌పై నమ్మకంతో ప్రమోషన్స్‌కు గేర్ మార్చ బోతున్నారని తెలుస్తోంది.

ఇంతలా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా మాయా జాలం..అద్భుతమైన లోకాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్‌పైనే ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు విజువల్ వండర్‌ను అందించాలనే తపనతో మెగాస్టార్ సైతం విజువల్ ఎఫెక్ట్స్ పనుల విషయంలో మేకర్స్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే గతంలో పలుమార్లు విడుదల తేదీ వాయిదా ప‌డినా? క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గకూడదని యూనిట్ పట్టుదలతో పని చేస్తోంది.

ఆస్కార్ విజేత కీరవాణి అందిస్తున్న నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన మెగా బ్లాస్ట్ గ్లిమ్స్‌కు కీరవాణి ఇచ్చిన ఆర్ఆర్ గూస్‌బంప్స్ తెప్పించగా కొత్తగా వ‌చ్చే గ్లిమ్స్ అంతకుమించి ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 2026 ముగింపుకు చేరుకుంటున్న త‌రుణం 2027 కి వెల్క‌మ్ చెప్ప‌డానికి సిద్ద‌మ‌వుతోన్న త‌రుణంలో ఇక‌పై `విశ్వంభ‌ర` రిలీజ్ వ‌ర‌కూ హ‌డావుడి త‌ప్ప‌ద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే రిలీజ్ బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో ఇక‌పై జాప్యం లేకుండా రిలీజ్ చేసే అవ‌కాశం క‌నిపిస్తుంది. `కాకా` త‌ర్వాత రిలీజ్ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ నెల‌..తేదీ ఎప్పుడ‌వుతుంది? అన్న‌దే ఆస‌క్తిక‌రం.

Tags:    
  • chiranjeevi 
  • vishwambhara 
  • megastar 
  • vassishta 
  • uvcreations 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

Copyright @2026

Powered by Blink CMS