ఆచార్యను వద్దని కృష్ణ చేయి పట్టనుందా?
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య నుండి త్రిష తప్పుకున్న విషయం తెల్సిందే. ఆమె ఎందుకు తప్పుకుందనే విషయం ఒకొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. తనకు మొదట చెప్పినట్లుగా కాకుండా మరో విధంగా స్క్రిప్ట్ ఉండటం వల్ల తాను సినిమా నుండి తప్పుకున్నట్లుగా త్రిష ప్రకటించగా చిరంజీవి మాత్రం అందుకు విరుద్దంగా చెప్పిన విషయం తెల్సిందే. మొత్తానికి ఆచార్య నుండి ఆమె బయటకు వెళ్లి పోవడం మాత్రం చాలా పెద్ద చర్చకు దారి తీసింది. తెలుగు సినిమాల్లో త్రిష మళ్లీ నటించడం అనుమానమే అనుకుంటున్న సమయంలో ఆమెకు రవితేజ ఛాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
చాలా ఏళ్ల క్రితం రవితేజ.. త్రిషలు కలిసి సూపర్ హిట్ మూవీ ‘కృష్ణ’ లో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కొన్ని నెలల క్రితం రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికు సినిమా పట్టాలెక్కేది. క్రాక్ సినిమాను పూర్తి చేసిన వెంటనే రవితేజ.. రమేష్ వర్మల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఆ సినిమాలో రవితేజకు జోడీగా త్రిష అయితే బాగుంటుందనే అభిప్రాయంలో దర్శకుడు రమేష్ వర్మ ఉన్నాడట. తాజాగా ఆమెకు ఫోన్ ద్వారా స్టోరీ లైన్ కూడా వినిపించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత త్రిషను కలిసి పూర్తి స్క్రిప్ట్ వినిపించేందుకు దర్శకుడు రెడీ అవుతన్నాడట. మరి చిరంజీవి సినిమాకే నో చెప్పిన త్రిష రవితేజ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటుందా అనేది చూడాలి.